bjp mp laxman: రేవంత్ బీజేపీ స్కూల్ వ్యాఖ్యలపై ఎంపీ లక్ష్మణ్ రియాక్షన్ ఇదే..
bjp mp laxman: తాను బీజేపీ స్కూల్ నుంచే వచ్చానని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కామెంట్లకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ స్కూల్ నుంచి డ్రాపౌట్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ స్కూళ్లో జాతీయవాదం, దేశం గురించి బోధిస్తామని చెప్పారు.
కానీ రేవంత్ వాటన్నింటిని ఎప్పుడో వదిలేశారని పేర్కొన్నారు. ఆయన తన పదవిని కాపాడుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టారంటూ విమర్శించారు. బీజేపీ కార్యాలయానికి ఎంతోమంది సమస్యలతో వస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతున్నదని ఆరోపించారు. 11 ఏండ్ల మోడీ పాలనపై ఒక్క అవినీతి మరక అయినా ఉందా? అంటూ ప్రశ్నించారు. మోడీ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ గాడిలో పెట్టారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram