12A Railway Colony: రూట్ మార్చిన అల్ల‌రి న‌రేశ్‌.. పొలిమేరను మించి హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ రెడీ

  • By: sr    news    Mar 17, 2025 6:41 PM IST
12A Railway Colony: రూట్ మార్చిన అల్ల‌రి న‌రేశ్‌.. పొలిమేరను మించి హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ రెడీ

12A Railway Colony

విధాత‌, సినిమా: ఇటీవ‌ల బ‌చ్చ‌ల‌మ‌ల్లి అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నిరాశ ప‌రిచిన‌ అల్ల‌రి న‌రేశ్ (Allari Naresh) కాస్త గ్యాప్ తీసుకుని న‌టిస్తోన్న కొత్త చిత్రం 12 ఏ రైల్వే కాల‌నీ (12A Railway Colony). పొలిమేర (Polimera) రెండు భాగాల‌కు క‌థ, ర‌చ‌న చేసిన డాక్ట‌ర్ అనీల్ విశ్వ‌నాథ్ (Dr Anil Vishwanath) ఈ సినిమాకు క‌థ ,ర‌చ‌న, స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తుండ‌గా శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నాడు. నాని కాస‌ర‌గ‌డ్డ (Nani Kasaragadda) ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. ఈ వేస‌విలో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు కామెడీ, ఎమోష‌న‌ల్ డ్రామాల‌తో ఆక‌ట్టుకున్న అల్ల‌రి న‌రేశ్ ఫ‌స్ట్ టైం త‌న పంథా మార్చి హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో సినిమా చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈక్ర‌మంలో తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ చూస్తే ఈ మూవీ పొలిమేర‌ను మించి థ్రిల్లింగ్ అంశాల‌తో తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న…! అంటూ వ‌చ్చే డైలాగులు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

పొలిమేర రెండు భాగాల్లో కీల‌క పాత్ర పోషించిన న‌టి కామాక్షి భాస్క‌ర్ల ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా సాయి కుమార్‌, గెట‌ప్ శ్రీను, అవిష్ కురువిల్లా, వైవ హ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. భీమ్స్ సిసీరిలియో (Bheems Ceciro) సంగీతం అందిస్తున్నాడు. చూడాలి ఈసారి రూట్ మార్చిన న‌రేశ్‌కు ఇదైనా సాలీడ్ హిట్ ఇస్తుందేమో.