Bigg Boss 9 | బిగ్‌బాస్ ఫైనల్ వీక్.. కళ్యాణ్–తనూజ మాటలతో సరికొత్త చర్చ.. గేమ్ కంటే గాసిప్‌కే ఎక్కువ చోటు!
Bigg Boss 9 | బిగ్‌బాస్ సీజన్ మొత్తం చూస్తే చాలామంది కంటెస్టెంట్లు ఒకరికోసం ఒకరు గట్టిగా నిలబడ్డ సందర్భాలు స్పష్టంగా కనిపిస్తాయి. రీతూ కోసం డెమాన్ పవన్, సంజన కోసం ఇమ్మానుయేల్, తనూజ కోసం భరణి లాంటి ఉదాహరణలు హౌస్‌లో ఎన్నో చూశాం.
Bigg Boss 9 | బిగ్‌బాస్ సీజన్ మొత్తం చూస్తే చాలామంది కంటెస్టెంట్లు ఒకరికోసం ఒకరు గట్టిగా నిలబడ్డ సందర్భాలు స్పష్టంగా కనిపిస్తాయి. రీతూ కోసం డెమాన్ పవన్, సంజన కోసం ఇమ్మానుయేల్, తనూజ కోసం భరణి లాంటి ఉదాహరణలు హౌస్‌లో ఎన్నో చూశాం. కానీ కళ్యాణ్–తనూజ విషయంలో మాత్రం “ఒకరికోసం ఒకరు నిలబడ్డారు” అని చెప్పేంత స్పష్టమైన ఉదాహరణలు పెద్దగా కనిపించలేదన్నదే ప్రేక్షకుల అభిప్రాయం.
సీజన్ మొత్తం తనూజ తన గేమ్‌పై ఫోకస్ పెట్టినట్టే కనిపించగా, కళ్యాణ్ మాత్రం చివరి వారంలో ఆమె వెంట ఎక్కువగా ఉన్నాడు. తన గెలుపు కంటే తనూజ గెలుపే తనకు ముఖ్యమన్నట్టుగా అతడి ప్రవర్తన ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బిగ్‌బాస్ ఆదేశిస్తే తప్ప తనూజ కళ్యాణ్ వైపు గట్టిగా నిలబడిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఈ విషయంలో రీతూ–డెమాన్ మధ్య కనిపించిన బాండింగ్‌తో పోలిస్తే, కళ్యాణ్–తనూజల మధ్య గేమ్ పార్ట్‌నర్‌షిప్ కంటే “సంథింగ్ సంథింగ్” అనే చర్చే ఎక్కువగా నడిచిందని టాక్.
అయితే ఫైనల్ వారం, ఫైనల్ డేకు దగ్గరయ్యే సరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకరికోసం ఒకరు చెప్పుకున్న భారీ డైలాగ్‌లు చూసి బయట ఫ్యాన్స్ తలలు పట్టుకున్న పరిస్థితి. “మిమ్మల్ని గెలిపించడానికి మేం బయట ఇంత కష్టపడితే, మీరు మాత్రం హౌస్‌లో ఇలా రాసుకుని పూసేసుకుంటున్నారేంటి?” అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తనూజ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “కళ్యాణ్ పడాలలో నన్ను నేను చూసుకుంటున్నా.. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క లైఫ్‌లో ఇలాంటి అబ్బాయి ఉండాలి” అని ఆమె అనడం హౌస్‌లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ చర్చకు దారితీసింది. దానికి కళ్యాణ్ ముఖంలో వచ్చిన ఆనందం అందరికీ కనిపించింది. వెంటనే అతడూ “నేను పర్ఫెక్ట్ గేమ్‌ని అర్థం చేసుకుని ఆడగలిగితే, అది తనూజ వల్లే” అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ మాటలకు తనూజ ఎక్స్‌ప్రెషన్స్ కూడా హైలైట్ అయ్యాయి. అయితే 104 రోజుల ఎపిసోడ్‌లలో తనూజ వల్ల కళ్యాణ్ పర్ఫెక్ట్ గేమర్‌గా మారిన దృశ్యాలు ఎక్కడా స్పష్టంగా చూపించలేదన్నది ప్రేక్షకుల ప్రశ్న. వీళ్ల మాటలు వింటూ హౌస్‌మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా డెమాన్, ఇమ్మానుయేల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆ షాక్ అర్థమైంది.
ఇక ఈ ఎమోషనల్ డైలాగ్‌ల తర్వాత టాప్–5 కంటెస్టెంట్స్‌తో శ్రీముఖి, ప్రదీప్ కలిసి కేక్ కట్ చేయించడం ఫైనల్ వారం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా చూస్తే, కళ్యాణ్–తనూజ మధ్య గేమ్ పార్ట్‌నర్‌షిప్ కంటే మాటల హడావుడి, ఎమోషనల్ డ్రామానే ఎక్కువగా కనిపించిందన్నదే బిగ్‌బాస్ ప్రేక్షకుల ఫైనల్ టాక్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram