Chiranjeevi | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికైన ఆపద వస్తే వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి. ఆయన సినీ ప్రయాణం ఎంత గొప్పదో, అంతే కష్టాలతో నిండి ఉంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆయన కెరీర్… నేడు మెగాస్టార్ స్థాయికి ఎదిగింది. కానీ ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారని ఆయనే పలు సందర్భాల్లో వెల్లడించారు.
‘నువ్వేమైనా స్టార్ హీరోవా?’ అన్న అవమానం
కెరీర్ ప్రారంభ దశలో విలన్, సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ముందుకు సాగిన చిరంజీవి, హీరోగా మారిన తర్వాత కూడా సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రముఖ నిర్మాత-దర్శకుడు క్రాంతికుమార్‌తో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని మలిచింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో, అందరి ముందు “నువ్వేమైనా స్టార్ హీరోవా? షాట్ ఉన్నా లేకున్నా ఇక్కడే ఉండాలి” అంటూ తీవ్రంగా మందలించారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆ అవమానం ఆయనను లోలోపల బాధపెట్టినా, అదే తనలో పట్టుదలను పెంచిందని తెలిపారు.
అవమానం నుంచి పుట్టిన పట్టుదల
ఆ సంఘటన తర్వాత “ఒక రోజు స్టార్ హీరోగా ఎదగాలి” అనే లక్ష్యంతో కృషి ప్రారంభించానని చిరంజీవి చెప్పారు. అదే సంకల్పం ఆయనను అగ్రస్థానానికి చేర్చింది. “నువ్వు స్టార్ హీరోవా అన్నప్పుడు… అవును, నేను స్టార్ హీరోనే అవుతా అని నిర్ణయించుకున్నాను” అనే ఆయన మాటలు ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
మరోసారి ఎదురైన అవమానం
ఇక మరో సందర్భంలో, ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు కోదండరామిరెడ్డికు చిరంజీవి ఇచ్చిన సలహాను అంగీకరించగా, నిర్మాత క్రాంతికుమార్ “డైరెక్టర్ నువ్వా, హీరోనా?” అంటూ అందరి ముందు తిట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో దర్శకుడు కోదండరామిరెడ్డి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
చెన్నై రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు
చిరంజీవి ప్రారంభ దశలో చెన్నైలో అవకాశాల కోసం తిరిగే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఒకసారి సినిమా ప్రివ్యూ షోకు వెళ్లినప్పుడు, కూర్చున్న సీట్ల నుంచి లేపి “ఇవి మీ కోసం కావు” అంటూ బయటకు పంపించారని ఆయన సోదరుడు నాగబాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పట్టుద వల్లే విజయం
ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, వాటినే ప్రేరణగా తీసుకుని చిరంజీవి తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ, తన కుటుంబం నుంచి పలువురు స్టార్లను పరిచయం చేశారు.
నేడు 70 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే అన్నట్టుగా యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి… టాలీవుడ్‌కు ఒక పెద్ద ఆధారంగా నిలిచారు. ఆయన ప్రయాణం ప్రతి యువ నటుడికి ప్రేరణగా నిలుస్తోంది.
