Dhurandhar 2 | ‘ధురంధర్ 2’ సెన్సేషన్.. 2000 కోట్లు కొల్ల‌గొట్ట‌క‌ ముందే అరుదైన రికార్డ్

Dhurandhar 2 | బాలీవుడ్‌లో సంచలనంగా మారిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఇంకా 2000 కోట్ల మార్క్‌ను అందుకోకముందే అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Dhurandhar 2 | బాలీవుడ్‌లో సంచలనంగా మారిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఇంకా 2000 కోట్ల మార్క్‌ను అందుకోకముందే అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’ సాధించిన తాజా రికార్డ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హిందీ వ‌ర్షెన్‌లోనే రూ..1000 కోట్లు..

ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో లేదా ఓవర్సీస్ కలెక్షన్లతో పెద్ద సినిమాలు రికార్డులు సృష్టించినా, ఈ సినిమా మాత్రం కేవలం హిందీ వెర్షన్‌లోనే రూ.1000 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఓన్లీ హిందీ వెర్షన్‌తో 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ఇది నిలిచింది.

బాక్సాఫీస్ రన్ ఇంకా కొనసాగుతుండగా, రోజుకు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూళ్లు రాబడుతూ ‘ధురంధర్ 2’ సూపర్ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. త్వరలోనే ఈ సినిమా రూ.2000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

అదే మైన‌స్..

అయితే ఈ భారీ కలెక్షన్ల మధ్య ఒక ముఖ్యమైన అంశం కూడా చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసినట్లుగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కాలేకపోవడం వల్ల ఈ సినిమా ప్రారంభ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ మిస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ రద్దు కావడం, తొలి రెండు రోజుల షోలు ఆగిపోవడం ప్రభావం చూపినట్లు సమాచారం.

గత సంవత్సరం వచ్చిన మొదటి భాగం కూడా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌కు కొత్త ఊపిరి ఇచ్చింది. ఇప్పుడు ‘ధురంధర్ 2’ మాత్రం ఆ విజయాన్ని మించి రికార్డుల వేట కొనసాగిస్తూ ఇండస్ట్రీని మరోసారి శిఖరానికి తీసుకెళ్తోంది.

మొత్తానికి, ‘ధురంధర్ 2’ కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా, కొత్త రికార్డులను సృష్టిస్తూ బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. ఇక ఈ చిత్రం 2000 కోట్ల మైలురాయిని చేరుతుందా లేదా అనేది చూడాలి.

Latest News