Mega 158 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన అంకితభావంతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. తన తదుపరి భారీ యాక్షన్ చిత్రం ‘మెగా 158’ ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో, జిమ్లో కఠినమైన వర్కౌట్లు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మెగా 158’ చిత్రం మే 21న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసిన 52 సెకన్ల వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చెమటోడుస్తున్న చిరు..
ఈ వీడియోలో చిరంజీవి రోప్ డ్రిల్స్, బైసెప్స్ వ్యాయామాలు, హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన ఫిట్నెస్ సెషన్లను ఎంతో ఎనర్జీతో పూర్తి చేస్తూ కనిపించారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న ఫిట్నెస్, క్రమశిక్షణ, శ్రమ నేటి తరం యువ హీరోలకు సైతం సవాల్ విసిరేలా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఇటీవల మోకాలి, భుజం శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ, కేవలం మూడు నెలల వ్యవధిలోనే మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించి జిమ్లో చెమటోడ్చడం విశేషంగా మారింది. రాబోయే సినిమా కోసం ఆయన ఎంతటి స్థాయిలో సిద్ధమవుతున్నారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
బాబీ కామెంట్..
ఈ వీడియోతో పాటు చిరంజీవి, “ప్రతి రోజు అనేది మన పరిమితులను దాటి ముందుకు సాగడానికి లభించే ఒక సరికొత్త అవకాశం. నా ప్రియమైన దర్శకుడు బాబీతో ‘మెగా 158’ కోసం మరో చిరస్మరణీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను” అంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
చిరంజీవి పోస్ట్పై దర్శకుడు బాబీ కూడా స్పందిస్తూ, “మీ కసి, క్రమశిక్షణ, అంకితభావం అసమానమైనవి. మీతో మరోసారి అద్భుతాన్ని సృష్టించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇక సోషల్ మీడియాలో అభిమానులు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఈ వయసులో ఇంత డెడికేషన్ అంటే నెక్స్ట్ లెవెల్”, “క్రమశిక్షణకు మరో పేరు చిరంజీవి”, “బాస్ బీస్ట్ మోడ్లో ఉన్నారు” అంటూ మెగా అభిమానులు కామెంట్లతో హంగామా చేస్తున్నారు.
కాగా, చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని అందుకోవడంతో ‘మెగా 158’పై అంచనాలు మరింత పెరిగాయి. సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ డ్రామాలో చిరంజీవి శక్తివంతమైన మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు.
Dear Annayya,
Every time I see you train with this intensity and passion, it reminds me why you continue to inspire generations 🙏🏻The fire, discipline and hunger in you are simply unmatched. It’s pushing me to dream bigger and work harder for #Mega158 🤗
Beyond excited to… https://t.co/hrUr2JTRki
— Bobby (@dirbobby) May 17, 2026
