Monalisa | వివాదాల నడుమ మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ వివాహం.. ఇలా చేస్తే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాం..

Monalisa | ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన మోనాలిసా ఇటీవల తన ప్రియుడు ఫ‌ర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిన ఈ పెళ్లిపై ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొంది.

Monalisa | ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన మోనాలిసా ఇటీవల తన ప్రియుడు ఫ‌ర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిన ఈ పెళ్లిపై ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొంది.

ముఖ్యంగా ఈ వివాహాన్ని ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మోనాలిసా మైనర్ అని, ఈ వివాహం చెల్లదని ఆమె తల్లిదండ్రులు పేర్కొనడం మరింత వివాదానికి దారితీసింది. మరోవైపు, ఆమెతో సినిమా చేయనున్న దర్శకుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

విలేక‌రుల స‌మావేశంలో..

ఈ ఆరోపణలన్నింటిపై తాజాగా స్పందించిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ జంట విలేకరుల సమావేశం నిర్వహించి తమ వేదనను వ్యక్తం చేసింది. “మా వివాహాన్ని లవ్ జిహాద్‌గా పిలవవద్దు. మేము ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం” అని వారు స్పష్టం చేశారు.

ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ… నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. అది తప్పా? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రేమించడం తప్పా? మాకు డబ్బు లేదు. పని చేయకపోతే ఎలా బతుకుతాం? మా దారిన మమ్మల్ని వదిలేయండి. ఇలా వేధిస్తే మాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అని భావోద్వేగంగా తెలిపారు.

సాయం చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య‌నే..

ఇక తమ వివాహం గుడిలో జరిగినదని, ఎవరికైనా వెళ్లి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని ఫర్మాన్ వివరించారు. దేవుడిపై విశ్వాసంతోనే తాము వివాహం చేసుకున్నామని చెప్పారు.

మరోవైపు, మోనాలిసా కూడా స్పందిస్తూ ప్రభుత్వ సహాయం కోరింది. “ఢిల్లీ, మధ్యప్రదేశ్ లేదా కేరళ ప్రభుత్వాలు మాకు సహాయం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించింది. అలాగే బాలీవుడ్ దర్శకుడు స‌రోజ్ మిశ్రాపై కూడా మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మొత్తానికి ప్రేమ వివాహంగా ప్రారంభమైన ఈ కథ ఇప్పుడు వివాదాల దిశగా మారి, సామాజిక, మతపరమైన చర్చలకు దారితీస్తోంది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Latest News