Naga Chaitanya- Samantha | స్టార్ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఒకే వేదికపై కనిపించడం.
రిసెప్షన్‌కు నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. విడిపోయిన తర్వాత వీరిద్దరూ ఒకే ఈవెంట్‌లో కనిపించడం అక్కడికి వచ్చిన అతిథుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టైలిష్‌గా నాగ చైతన్య..
వేడుకలో సమంత పర్పుల్-గోల్డ్ కలర్ చీరలో ఎంతో అందంగా మెరిసింది. సింపుల్ స్టైలింగ్‌తో, చిరునవ్వుతో కెమెరాలకు పోజులిచ్చి అందరినీ ఆకట్టుకుంది. రాజ్ నిడిమోరు సూట్‌లో క్లాసీగా కనిపిస్తూ ఆమెతో కలిసి స్టేజ్‌పై ఫోటోలు దిగారు.
ఇక నాగచైతన్య సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, శోభిత ధూళిపాళ బ్లూ-పింక్ కలర్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జంట కూడా వధూవరులతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేసింది.
వైరల్‌గా మారిన ఫొటోలు..
ఈ కార్యక్రమానికి నాగార్జున, అమల కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం విశేషం. అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరై వేడుకను మరింత ఘనంగా తీర్చిదిద్దారు. విడిపయిన తర్వాత తొలిసారి ఈ జంట ఇలా కనిపించడం ఇదే తొలిసారి కావడంతో, ఆ ఈవెంట్‌లో వారిపైనే ప్రత్యేక దృష్టి పడింది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
