Peddi | ఊహించిన‌ట్టే ‘పెద్ది’ వాయిదా… ఏప్రిల్ 30 రిలీజ్ స్లాట్ కోసం పెరిగిన పోటీ!

Peddi | పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ వాయిదా పడటంతో ఏప్రిల్ 30 క్రేజీ రిలీజ్ డేట్ ఖాళీ అయింది. ఇప్పుడు ఈ స్లాట్‌ను దక్కించుకునేందుకు చిన్న, మధ్య తరహా సినిమాలు పోటీ పడుతున్నాయి.

Ram Charan’s upcoming film ‘Peddi’, directed by Buchi Babu Sana, is shaping up into a massive period sports drama.

Peddi | పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ వాయిదా పడటంతో ఏప్రిల్ 30 క్రేజీ రిలీజ్ డేట్ ఖాళీ అయింది. ఇప్పుడు ఈ స్లాట్‌ను దక్కించుకునేందుకు చిన్న, మధ్య తరహా సినిమాలు పోటీ పడుతున్నాయి.

మిడ్ సమ్మర్‌లో అత్యంత క్రేజీగా భావించే ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ ఈసారి టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. ఒకప్పుడు ఇలాంటి సమ్మర్ డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడేవారు. అయితే ప్రస్తుతం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) మేనియా కారణంగా సమ్మర్‌లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినప్పటికీ, మంచి రిలీజ్ డేట్‌కు డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈసారి ఈ కీలక తేదీన భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదల కావాల్సి ఉంది. అయితే గత కొన్ని వారాలుగా వస్తున్న ప్రచారానికి తెరదిస్తూ చిత్ర బృందం ఈ సినిమాను వాయిదా వేసింది. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ ఇప్పుడు జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఖాళీ అయిన స్లాట్..

‘పెద్ది’ వాయిదా పడటంతో ఏప్రిల్ 30 స్లాట్ ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సినిమాలకు ఇది మంచి అవకాశం గా మారింది. ఇప్పటికే మే 1న విడుదలకు ప్లాన్ చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఇప్పుడు ఈ వీకెండ్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత దిల్ రాజు ముందుగానే కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘పెద్ది’ రాకపోతేనే తమ సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి కలగడంతో ‘గాయపడ్డ సింహం’ ఆ డేట్‌ను ఫైనల్ చేసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇక మరోవైపు లెనిన్ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. తొలుత మే 1కి షెడ్యూల్ చేసిన ఈ చిత్రాన్ని ‘పెద్ది’ కోసం వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగానే వాయిదా పడిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ‘పెద్ది’ వాయిదా నేపథ్యంలో ‘లెనిన్’ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 30కి రావడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

నిఖిల్ సినిమా క‌ష్ట‌మే..

ఇదిలా ఉండగా, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ కోసం కూడా ఈ తేదీని పరిశీలించినట్లు సమాచారం. కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనులు పూర్తి చేయాల్సి ఉండటంతో తక్షణ నిర్ణయం తీసుకోవడం కష్టం అనిపిస్తోంది.

అదేవిధంగా సమంత రుత్ ప్రభు నటిస్తున్న మా ఇంటి బంగారం చిత్రాన్ని మే 15 నుంచి ముందుకు తీసుకురావచ్చనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తంగా ‘పెద్ది’ వాయిదా పడటంతో ఖాళీ అయిన ఏప్రిల్ 30 రిలీజ్ స్లాట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చివరికి ఈ క్రేజీ డేట్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

Latest News