Peddi Teaser | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీమ్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ అందించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి విడుదలైన ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు వచ్చిన టీజర్లు, పోస్టర్ల ఆధారంగా ఈ సినిమాలో చరణ్ కేవలం రూరల్ క్రికెట్ ప్లేయర్‌గా మాత్రమే కనిపిస్తాడని అందరూ భావించారు. అయితే తాజా గ్లింప్స్ ఆ అంచనాలను పూర్తిగా మార్చేసింది. ఇందులో చరణ్ కుస్తీ పోటీల్లో తలపడే మల్లయోధుడిగా దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
అన్నీ ప్రత్యేక ఆకర్షణ..
‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’లో చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కండలు తిరిగిన శరీరంతో, రఫ్ అండ్ మాస్ స్టైల్‌లో ఆయన కనిపించిన తీరు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కుస్తీ కోసం తీసుకుంటున్న కఠినమైన శిక్షణ, పోటీలో ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు అన్నీ కలిసి ఈ పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించాయి.
గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్‌లు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. “కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా… ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట” అనే డైలాగ్‌తో చరణ్ ఎంట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. చివర్లో “చూడమ్మి ఆటే నా పొగరు” అంటూ చెప్పిన డైలాగ్ ఈ వీడియోకు హైలైట్‌గా నిలిచింది.
పలు భాషలలో విడుదల..
ఈ గ్లింప్స్‌ను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ద్వారా చిత్ర బృందం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఉన్న అంచనాలను ఈ వీడియో మరింత పెంచింది.మొత్తానికి, ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న కోణాల్లో—క్రికెటర్‌గా, అలాగే పహిల్వాన్‌గా కనిపించనున్నాడనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఈ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
భారీ నిర్మాణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ గ్లింప్స్‌తో ఆ అంచనాలు మరింత పెరిగి, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
