Rashmika Mandanna | ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 కార్యక్రమం భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ వేడుకలో ఉత్తమ నటి అవార్డును రష్మిక మందన్న అందుకుంది. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను ఈ గౌరవం దక్కింది.హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరింత ప్రత్యేకంగా మారింది. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండతో కలిసి వచ్చిన రష్మిక చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు హైలైట్ ఆమె స్పీచ్.
అవార్డు స్వీకరించిన తర్వాత మాట్లాడిన రష్మిక భావోద్వేగానికి లోనైంది.నేను కోడలు కాకముందు కూతురిలా ప్రేమ ఇచ్చారు. కానీ ఈ రోజు అఫీషియల్‌గా కోడలిగా మీ ముందు నిల్చున్నా. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్యామిలీని బాగా చూసుకోండిఅని చెప్పడంతో మాధవి దేవరకొండ కంటతడి పెట్టారు.ఆ సమయంలో ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక తన ప్రయాణం గురించి మాట్లాడుతూ,ఒకప్పుడు నా పర్ఫార్మెన్స్‌ను ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్‌కు స్టేట్ అవార్డు రావడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది అని రష్మిక చెప్పింది.అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్రన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.రాహుల్ లేకపోతే ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండేది కాదు. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలనే ఆత్మవిశ్వాసాన్ని ఈ అవార్డు ఇచ్చిందిఅని పేర్కొంది.చివరగా, “పాపలు… నేను సాధించా. ఇక ఇంటికి వెళ్లి పార్టీ చేద్దాం” అంటూ తన స్పీచ్ ముగించడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ ఎమోషనల్, క్యూట్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
