Ravi Babu | సినిమా మేకింగ్‌పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. అన్‌లిమిటెడ్ టైమ్‌తో ఎవడైనా సినిమా తీస్తాడంటూ కామెంట్

Ravi Babu | బాహుబలి తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరగడంతో సినిమాల మేకింగ్ విధానం, బడ్జెట్, వర్కింగ్ డేస్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తక్కువ రోజుల్లో సినిమాలను పూర్తి చేసిన దర్శకులు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒక్కో సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు పట్టడం సాధారణమైపోయింది.

Ravi Babu | బాహుబలి తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరగడంతో సినిమాల మేకింగ్ విధానం, బడ్జెట్, వర్కింగ్ డేస్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తక్కువ రోజుల్లో సినిమాలను పూర్తి చేసిన దర్శకులు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒక్కో సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు పట్టడం సాధారణమైపోయింది.

ఈ మార్పులపై తాజాగా దర్శకుడు, నటుడు రవిబాబు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. విభిన్న కథలతో తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవిబాబు, కొంత విరామం తర్వాత తన కొత్త యాక్షన్ థ్రిల్లర్ రేజర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మే 8న విడుదలకు సిద్ధమవుతోంది.

మేకింగ్ విధానంపై విమ‌ర్శ‌లు..

ఈ సందర్భంగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రవిబాబు, ప్రస్తుత సినిమా మేకింగ్ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “సినిమా మేకింగ్ అంటే ఒక కథను నిర్ణయించిన బడ్జెట్‌లో, నిర్ణయించిన టైమ్‌లో పూర్తి చేయడం. కానీ ఇప్పుడు అన్‌లిమిటెడ్ టైమ్ తీసుకుంటున్నారు. అలా అయితే ఎవడైనా సినిమా తీస్తాడు. ఇలాంటి విధానాన్ని హాలీవుడ్ స్టూడియోలు ఎప్పటికీ అంగీకరించవు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే కాకుండా ఆయన ఇండస్ట్రీలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా స్పందించారు. ఒకప్పుడు నిర్మాతలు కీలక పాత్ర పోషించేవారని, కథల ఎంపిక నుంచి సినిమా రూపకల్పన వరకు వారు చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, హీరోలే పరిశ్రమను నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆ క‌ల్చ‌ర్ క‌నిపించ‌డం లేదు..

“ఇప్పుడైతే నిర్మాతలు, రైటర్లు కూడా హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు సినిమా మొత్తం టీమ్ కలిసి పనిచేసేది. ఇప్పుడు ఆ కల్చర్ కనిపించడం లేదు” అంటూ రవిబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే రవిబాబు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతుండగా, కొందరు ఆయన అభిప్రాయాలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

మొత్తానికి, పాన్ ఇండియా ట్రెండ్‌తో మారిన సినిమా మేకింగ్ విధానంపై రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో ఈ అంశంపై మరింత చర్చ జరగనుంది.

Latest News