Samantha | అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు పెళ్లి డిసెంబర్ 1న గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో, ఈ వివాహం టాలీవుడ్–బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా… ఇప్పుడు సమంత వేలికి ఉన్న రింగ్‌కి సంబంధించిన మరో వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
2020లో మొదలై, 2021లో డేటింగ్ రూమర్స్
సమంత & రాజ్ పరిచయం 2020లోనే ‘ఫ్యామిలీ మాన్’ షూటింగ్ సమయంలో మొదలైందని,2021లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. గత కొన్ని నెలలుగా వీరి రిలేషన్ గురించి జోరుగా వార్తలు వస్తుండగా, చివరికి పెళ్లి చేసుకొని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత పెళ్లి రింగ్ బాగా వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రాయల్ స్టైల్ డైమండ్ రింగ్ విలువ: దాదాపు ₹50 లక్షలు ఉంటుందని, రాజ్ ఈ రింగ్‌ను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారట
అయితే ఈ రింగ్ నిజానికి… ఎంగేజ్మెంట్ రింగ్. పాత ఫోటోల ఆధారంగా నెటిజన్లు కొత్త విషయాన్ని కనిపెట్టారు. సమంత ఈ రింగ్‌ను గత 10 నెలలుగా వాడుతోంది. పబ్లిక్ ఈవెంట్స్, ట్రిప్స్, సోషల్ మీడియా పోస్ట్‌లలో కూడా ఈ రింగ్ కనిపిస్తుంది. అంటే… వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడో జరిగిపోయింది. సైలెంట్‌గా, ఎలాంటి హంగామా లేకుండా ఇద్దరూ రహస్యంగా తమ నిశ్చితార్థం చేసుకున్నారన్నమాట. సమంత ఎప్పటి నుండో హింట్ ఇచ్చిన కూడా మనం అది గమనించలేకపోయాము. ఇంటర్నెట్‌లో ఇప్పుడు “సమంత పాత ఫోటోలు , రింగ్ జూమ్ చేసిన” పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ‘Samantha Engagement Mystery’ అన్న హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. సమంత–రాజ్ వివాహం అభిమానులకు సర్ప్రైజ్ అనిపించిన.. వారి ప్రేమ కథ, ఎంగేజ్మెంట్ రింగ్ వివరాలు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.
