Sreeleela | ట్రోల్స్‌తో కుంగిపోయిన శ్రీలీల.. సినిమాలు వదిలేయాలనుకున్నానంటూ కామెంట్స్

Sreeleela | టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ ప్రయాణం మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ సాగుతోంది.

Sreeleela | టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ ప్రయాణం మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ సాగుతోంది. ‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ, ధమాకా చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆ తరువాత చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించే అవకాశాలు వరుసగా అందిపుచ్చుకుంది.

అయితే అవకాశాలు పెరిగినప్పటికీ, విజయాలు మాత్రం అంతగా కలిసి రాలేదు. ‘ధమాకా’, భగవంత్ కేసరి సినిమాలు మినహా మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఆమె నటన, సినిమాల ఎంపికపై నెటిజన్లు విపరీతంగా విమర్శలు గుప్పించారు.

మ‌న‌సులోని బాధ‌..

ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల తన మనసులోని బాధను బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన నెగెటివ్ కామెంట్స్ తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పింది. తాను చాలా సెన్సిటివ్ వ్యక్తినని, ట్రోల్స్ చూసి భయపడేదాన్నని, కొన్ని సందర్భాల్లో ఆ బాధను తట్టుకోలేక ఏడ్చిన రోజులూ ఉన్నాయని భావోద్వేగంగా వెల్లడించింది.

“ఇదంతా నా వల్ల అవుతుందా? నేను భరించలేకపోతున్నాను… సినిమాలు వదిలేసి మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకుంటా?” అని తన తల్లిని అడిగిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ శ్రీలీల కన్నీళ్లు పెట్టుకుంది. అయితే కాలక్రమేణా తనలో మార్పు వచ్చిందని, ఇప్పుడు అలాంటి ట్రోల్స్‌ను ధైర్యంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకున్నానని స్పష్టం చేసింది.

శ్రీలీల‌పై పాజిటివ్ కామెంట్స్..

ఇక తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో, శ్రీలీలపై నెట్టింట పాజిటివ్ కామెంట్స్ పెరుగుతున్నాయి. ఒక సాధారణ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ చాలా మందిని ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ, “ఎవరేమన్నా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్లడం గొప్ప విషయం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ట్రోల్స్‌ను ఎదుర్కొని మరింత బలంగా మారిన శ్రీలీల కథ ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Latest News