Klin kaara|క్లింకారకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అదేంటంటే.!
Klin kaara| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి దాదాపు పదేళ్ల తర్వాత అందమైన కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ఆ కూతురి ఫేస్ ఎక్కడ రివీల్ కాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కూతురితో పలు ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందం కలిగిస్తున్నారు. అ
Klin kaara| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి దాదాపు పదేళ్ల తర్వాత అందమైన కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ఆ కూతురి ఫేస్ ఎక్కడ రివీల్ కాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కూతురితో పలు ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందం కలిగిస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఆసక్తికరమైన విషయం తెలియజేసారు. ఒక వాహన బ్రాండ్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ క్లింకారకి కూడా తన లాగా జంతువులంటే ఇష్టమని చెప్పారు. తాజాగా రామ్ చరణ్.. మగధీర సినిమాలో కనిపించిన బాద్ షా గుర్రంకు జన్మించిన గుర్రం పిల్లను తన కూతురుకు బహుమానంగా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ స్వయంగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు క్లింకార కు అప్పుడే జంతువులు అంటే చాలా ఇష్టం ఏర్పడిందని, తనకు ఇచ్చిన గుర్రం పిల్లతో ఆడటం తో పాటు, పెట్స్ తో కూడా సరదగా ఆడుకుంటుందని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ఇక రామ్ చరణ్ కి గుర్రపు స్వారీ అన్నా, జంతువులన్నాఎంత ఇష్టమో మనకి తెలుసు. ఇక ‘మగధీర’ సినిమాలో కూడా ఆయన గుర్రపు స్వారీతో అదరహో అనిపించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సూపర్ హిట్ అయ్యింది. రామ్ చరణ్ కెరీర్ లో ఇది సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేశారు. బైక్ రేసర్ హర్ష పాత్ర పోషించడంతో పాటు కాల భైరవ పాత్రలో నటించి అదరహో అనిపించాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది.
ఇక కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార ఇంకా మెగాస్టార్ చిరంజీవి దంపతులు పారిస్ ట్రిప్ కు వెళ్లారు. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ ఈఫిల్ టవర్ వద్ద ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాత నానమ్మ తో క్లీంకార మొదటి విదేశీ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేసింది అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసాడు. క్లింకారకి ఎవరి పోలికలు వచ్చాయి, ఎవరి మాదిరిగా ఉంటుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram