Pawan Kalyan| హైపర్ ఆది రుణం పవన్ కళ్యాణ్ అలా తీర్చుకోనున్నాడా.. !
Pawan Kalyan| జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయన్ హైపర్ ఆది. ఆయన స్కిట్స్‌కి వేసే డైలాగులకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్న హైపర్ ఆది ఈ మధ్య జనసేనకి సపోర్ట్ చేస్తూ రాజకీయాలలో కాస్త యాక్టివ్‌గా కనిపిస్తున్నారు
Pawan Kalyan| జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయన్ హైపర్ ఆది. ఆయన స్కిట్స్‌కి వేసే డైలాగులకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్న హైపర్ ఆది ఈ మధ్య జనసేనకి సపోర్ట్ చేస్తూ రాజకీయాలలో కాస్త యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఎక్కువగా అభిమానించే హైపర్ ఆది ఆయనని ఎవరైన విమర్శిస్తే అందుకు తగ్గ కౌంటర్స్ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. షూటింగ్స్ మానేసి మరీ పిఠాపుంలో రోజుల తరబడి ఆయన ప్రచారం నిర్వహించారు.హైపర్ ఆదితో పాటు పలువురు జబర్ధస్త్ కమెడీయన్స్ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం మనం చూశాం.

అయితే ఎన్నికల ముందు కూడా జనసేన సభల్లో హైపర్ ఆది తన ప్రసంగంతో యువతలో ఉత్తేజం నింపారు.పంచులు, ప్రాసలతో అదగరగొట్టేశాడు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులపై హైపర్ ఆది వేసే పంచ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. కట్ చేస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేనకు కేటాయించిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు హైపర్ అధికారికంగా జనసేనలో చేరబోతున్నాడని, ఆయనకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నాడనే టాక్ ఒకటి నడుస్తుంది. పవన్ తన అన్నయ్య నాగబాబుకి ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. హైపర్ ఆదికి ఎమ్మెల్సీ ఇస్తాడు అంటే అది సంచలనమే.
అయితే హైపర్ ఆదికి ఎమ్మెల్సీ కాకపోయినా సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం అయితే నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు కూడా హైపర్ ఆదికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ అని ప్రచారం జరగగా, కూటమి వలన సీట్ల సర్ధుబాటులో అది జరగలేదు. లేదంటే హైపర్ ఆదికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ దక్కేదని కొందరు కామెంట్స్ చేశారు. మరి హైపర్ ఆదికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందనేది చూడాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram