అనుమానాలే నిజమయ్యాయి… మరోసారి ‘పెద్ది’ వాయిదా

రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మరోసారి వాయిదా పడింది. జూన్ 2026లో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎందుకు ఆలస్యమవుతోంది?

Ram Charan Peddi movie poster intense look with mace training rural wrestling backdrop June release postponement

అనుకున్నదే అయింది… ‘పెద్ది’ జూన్‌కి వెళ్లిపోయింది! 🔥 రామ్ చరణ్ మాస్ లుక్ వైరల్

Ram Charan Peddi Postponed Again, Now Targeting June Release 2026

విధాత వినోదం డెస్క్​ | 15 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్:

Peddi Postponed Again | మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ మారిన ఈ సినిమా, ఇప్పుడు జూన్ 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఖచ్చితమైన తేదీని మాత్రం చిత్రబృందం ఇంకా చెప్పలేదు.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసిన ఈ సినిమా, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా పడింది. తాజాగా మరోసారి పోస్ట్‌పోన్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

టాకీ పార్ట్​​ పూర్తిఓ పాట పెండింగ్​

చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమా టాకీ పార్ట్ పూర్తిగా ముగిసింది. ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిటింగ్ రషెస్​ కూడా చూసిన మేకర్స్ ఫలితంపై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

అయితే, టెక్నీషియన్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ మరింత నాణ్యతతో పని చేయడానికి అదనపు సమయం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 టీజర్‌తోనే హైప్… ‘కుస్తీ అంటే ప్రాణం పెట్టే ఆట

రామ్ చరణ్ బర్త్‌డే రోజు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. “కుస్తీ అంటే బ్యాట్ పట్టుకుని ఆడే ఆట కాదు… ప్రాణం పెట్టి మరణాన్ని ఎదుర్కొనే పోరాటం” అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్ మిక్స్‌గా ఆకట్టుకుంది.

గదతో ప్రాక్టీస్ చేస్తున్న రామ్ చరణ్ లుక్, మారిన శరీరాకృతి చూసి అభిమానులు ఫిదా అయ్యారు. చివర్లో “ఈ ఆట నా గౌరవం” అనే డైలాగ్ సినిమాకి థీమ్‌ను బలంగా చెప్పింది.

 పాన్ ఇండియా తారాగణంభారీ అంచనాలు

ఈ సినిమాలో బాలీవుడ్ నటి Janhvi Kapoor హీరోయిన్‌గా నటిస్తోంది. అదే విధంగా Shiva Rajkumar, Jagapathi Babu, Divyenndu, Boman Irani వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా, రూరల్​ మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

పెద్ది వాయిదాలు అభిమానులకు నిరాశ కలిగించినా, మేకర్స్ చెబుతున్నట్లుగా ఇది క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం అయితే ఫలితం మాత్రం భారీగానే ఉండే అవకాశముంది. జూన్‌లో వచ్చే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరోపక్క మెగాస్టార్​ చిరంజీవి ‘విశ్వంభర’ కూడా చడీచప్పుడు లేకపోవడం అభిమానులను బాధిస్తోంది.

Latest News