Ram Charan’s ‘Peddi’ Shoot Wrapped, Post-Production Begins – June Release Ahead
వినోదం డెస్క్ | హైదరాబాద్:
Ram Charan’s ‘Peddi’ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న రత్నవేలు అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రత్నవేలు సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందిస్తూ, “ఇదో గుర్తుండిపోయే ప్రయాణం. రామ్ చరణ్‌తో పని చేయడం ఎంతో ప్రత్యేకం” అని తెలిపారు. షూటింగ్ చివరి రోజు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ప్రత్యేక గీతంతో ముగింపు.. రెహ్మాన్ మ్యాజిక్
‘పెద్డి’ షూటింగ్ సెట్లో రామ్ చరణ్ – క్లైమాక్స్ షెడ్యూల్ దృశ్యం
చిత్రం చివరి షెడ్యూల్‌లో ఒక భారీ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటలో రామ్ చరణ్ సరసన శృతిహాసన్ నర్తించింది. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహమాన్ స్వరపరిచారు. భారీ సెట్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్‌తో ఈ పాట థియేటర్లలో దద్దరిల్లనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయి, ఫైనల్ అవుట్‌పుట్‌పై టీమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
జూన్‌లో విడుదల పక్కా..
‘పెద్డి’ షూటింగ్ పూర్తి.. రామ్ చరణ్ మాస్ సర్‌ప్రైజ్ రెడీ! రత్నవేలు ప్రకటన
ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయిస్తూ జూన్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ కనిపించనున్నారు.
టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. సినిమాటోగ్రఫీని ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్షన్‌ను అవినాశ్ కొల్లా నిర్వహిస్తున్నారు.
