ఇండియన్ సినిమా హిస్టరీలోనే రూ. 4వేల కోట్లతో రెండు భాగాలుగా నిర్మితమవుతున్న హిందీ రామాయణ్ మూవీ ‘రామాయణ’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), రాకింగ్ స్టార్ యష్ (రావణాసురుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ ను ఈ నెల 24నప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో నమిత్ మల్హోత్రా రామాయణ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిన రామాయణాన్ని ఈ తరం ఆడియన్స్‌కు నచ్చేలా సరికొత్తగా చూపించబోతున్నారు. రామాయణ్ మూవీ పార్ట్-1 ను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
