Roja | రోజాకి హీరోలెవ‌రు ప్ర‌పోజ్ చేయ‌లేదా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన సీనియ‌ర్ హీరోయిన్

Roja | ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా సెల్వమణి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు బుల్లితెరపై ‘జబర్దస్త్’ వంటి ప్రముఖ షోలతో కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే వేధింపుల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు, కాంప్రమైజ్‌లు తప్పవని చాలా మంది చెబుతుంటారు. కానీ నాకు వ్యక్తిగతంగా అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు” అని ఆమె స్పష్టం చేశారు.

నా జోలికి మాత్రం ఎవ‌రు రాలేదు..

“హీరోయిన్లకు నిజంగా వేధింపులు జరిగాయా లేదా అన్నది నాకు ప్రత్యక్షంగా తెలియదు. నేను కూడా అందరిలాగే విన్నాను అంతే. కానీ నా జోలికి మాత్రం ఎవరూ రాలేదు. నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు” అంటూ రోజా చెప్పుకొచ్చారు.

తమిళ చిత్రం ‘చామంతి’తో సినీ రంగ ప్రవేశం చేసిన రోజా, ఆ చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణితో తొలి సినిమాకే ప్రేమలో పడ్డట్లు వెల్లడించారు. “మా ప్రేమ అప్పట్లో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిపోయింది. సెల్వమణి గారు అప్పటికే ప్రముఖ దర్శకుడు కావడంతో, అందరూ నన్ను గౌరవంగా చూసేవారు” అని ఆమె తెలిపారు.

హీరోలు నాకు ప్ర‌పోజ్ చేయ‌లేదు..

అంతేకాదు, హీరోలు కూడా ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు. అలాంటప్పుడు వేధింపులు ఎలా ఉంటాయి? కెరీర్ ప్రారంభంలోనే సెల్వమణి గారితో ప్రేమలో ఉండటం నాకు ఒక రకంగా రక్షణగా మారింది అని రోజా వ్యాఖ్యానించారు.

సినిమాల్లోకి రావడం కూడా తన ప్లాన్ కాదని రోజా తెలిపారు. “నటనపై ప్రత్యేక ఆసక్తితో నేను ఇండస్ట్రీకి రాలేదు. అనుకోకుండా అవకాశాలు రావడంతో వచ్చాను. కాబట్టి అవకాశాల కోసం ఎలాగైనా ప్రయత్నించాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అందుకే ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదనుకుంటా” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో వేధింపుల అంశంపై రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.