Sri Reddy| జగన్ ఓటమిపై స్పందించిన శ్రీరెడ్డి.. అలా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ ఫైర్
Sri Reddy| ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ సాగిన ఈ సమరంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరచింది. గత అధికార పక్షం ఈ సారి ఎన్నికలలో చిత్తుగా ఓడి
Sri Reddy| ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ సాగిన ఈ సమరంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరచింది. గత అధికార పక్షం ఈ సారి ఎన్నికలలో చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చాలా బాధని కలిగిసుంది. అయితే ఈ సారి కూడా వైసీపీ తప్పక గెలుస్తుందని శ్రీరెడ్డి చెప్పుకు రాగా ఆమె వ్యాఖ్యలు అసత్యాలు అయ్యాయి. వైసీపీ ఓటమి తర్వాత శ్రీరెడ్డి తొలిసారి స్పందించింది.

శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘బాధపడకు జగన్ అన్న.. క్యాడర్‌కు కొత్త ఊపిరి పోయాలి. నిలబడు, పోరాడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో. ఇక రోజూ ఒక పోరాటమే. విజయం ఉన్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ. వెక్కిరించే వెదవలు కోసం కాదు.. నీ సైన్యం కోసం పోరాడాలి’ అంటూ జగన్‌కి సపోర్ట్‌గా పోస్ట్ చేసింది. అయితే ఆమె పోస్ట్‌పై కొందరు నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఓడిపోయాక కూడా ఇంకా సిగ్గురాలేదా అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు ‘ జగనన్న ఈ ఎన్నికల్లో గెలవక పోతే బీచ్ లో బట్టలు విప్పేసి తిరుగుతా ‘ అని శ్రీరెడ్డి గతంలో వేసిన పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.
జగన్ ఓడిపోయాడుగా ఇప్పుడు నిజంగానే బట్టలు విప్పేసి తిరుగుతావా ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేయగా, వాటికి శ్రీరెడ్డి తనదైన స్టైల్‌లో బదులిచ్చింది. ‘ తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా. బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా. ల … లారా అంటూ ఘాటుగా జవాబిచ్చింది. కాస్టింగ్ కౌచ్ అంశంతో బాగా హైలైట్ అయిన శ్రీరెడ్డి ఇక్కడ నానా రచ్చ చేసింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడ నుండి తన సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా తెలుగు ప్రజలకి టచ్‌లో ఉంటుంది. తన సోషల్ మీడియాలో వైఎస్ జగన్, వైసీపీ పార్టీకి మద్దతుగా సందేశాలు పోస్ట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ జగన్ పై అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది.. రీసెంట్ గా జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై కూడా శ్రీరెడ్డి ఘాటుగానే రియాక్ట్ అయింది. జగన్ పార్టీ దారుణమైన పరాజయం చెందడంతో శ్రీరెడ్డి సైలెంట్ అవుతుందని అందరు అనుకున్నారు. కాని ఆమె మాత్రం ఎప్పటి మాదిరిగానే రెచ్చిపోతూ
కామెంట్స్ చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram