Jabardasth fame Komarakka | బంగారం దొంగిలింత‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొమురక్క‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి

Jabardasth fame Komarakka | ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొముర‌క్క‌( Jabardasth fame Komarakka ) కొంత‌మంది యువ‌కులు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. అస‌లు కొముర‌క్క‌పై ఎందుకు దాడి చేయాల్సి వ‌చ్చిందంటే..?

Jabardasth fame Komarakka | బంగారం దొంగిలింత‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొమురక్క‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి

Jabardasth fame Komarakka | జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొముర‌క్క‌( Jabardasth fame Komarakka ).. అంద‌రికీ సుప‌రిచిత‌మే. స‌గ‌టు గ్రామీణ మ‌హిళా వేష‌ధార‌ణ ధ‌రించి.. న‌టిస్తూ.. జీవిస్తూ.. ఎంద‌రో హృద‌యాల‌ను గెలుచుకుంది. కొముర‌క్క మాట తీరును కూడా ఇష్ట‌పడే వారు చాలా మందినే ఉన్నారు. కొమురక్క‌లో త‌మ త‌ల్లిని, సోద‌రీమ‌ణుల‌ను చూసుకుంటున్నామ‌ని ఆనంద‌భాష్పాలు రాల్చిన వారు ఉన్నారు. అలా ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న కొముర‌క్క కొంత‌మంది యువ‌కులు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. అస‌లు కొముర‌క్క‌పై ఎందుకు దాడి చేయాల్సి వ‌చ్చిందంటే..?

కొముర‌క్క సొంతూరు మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా( Mahabubnagar ) బాలాన‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని ఉడిత్యాల‌. కొముర‌క్క‌కు బూర్గుల గ్రామ ప‌రిధిలోని కాశిరెడ్డిగూడ‌కు చెందిన శ్రీనాథ్ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. ఉడిత్యాల‌లోని కొముర‌క్క ఇంట్లో గ‌తంలో బంగారం చోరీకి గురైంది. బంగారం చోరీపై అనుమానంతో శ్రీనాథ్‌ను నిల‌దీయ‌గా.. తానే దొంగిలించాన‌ని, త్వ‌ర‌లోనే తిరిగి ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. కానీ ఎంతకు ఇవ్వ‌క‌పోవ‌డంతో.. రెండు రోజుల క్రితం శ్రీనాథ్‌ను కొముర‌క్క నిల‌దీశారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన శ్రీనాథ్.. కొముర‌క్క మంద‌లించిన విష‌యాన్ని త‌న స్నేహితుల‌కు చెప్పాడు.

వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్‌ అదేరోజు రాత్రి 11 గంటలకు కొమురక్క ఇంటికొచ్చారు. తాము కొముర‌క్క అభిమానుల‌మ‌ని, ఫొటోలు దిగేందుకు వ‌చ్చామ‌ని న‌మ్మ‌బ‌లికారు. ఫొటోలు దిగ‌డం ప‌క్క‌న‌పెట్టి.. శ్రీనాథ్‌తో ఎందుకు మందలించావ‌ని రామ్‌చ‌ర‌ణ్ అనే యువ‌కుడు కొముర‌క్క‌ను దూషించాడు. ఈ క్ర‌మంలోనే కొముర‌క్క‌పై వంశీకృష్ణ అనే యువ‌కుడు రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్‌ కర్రతో కొమురక్క కుడి చేతిని గాయపర్చాడు. అదుపు చేయడానికి వచ్చిన గ్రామానికి చెందిన రామును రాళ్లతో కొట్టారు. ఎప్పటికైనా చంపుతామని కొమురక్క‌ను బెదిరింపుల‌కు గురి చేశారు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితులు త‌మ బైక్‌ల‌ను వదిలేసి పరారయ్యారు. బుధవారం బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.