విక్టరి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీ ప్రచారం మొదలైంది. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ గ్లింప్స్ ను ను చిత్ర బృందం పరిచయం చేసింది. ఈ వీడియో గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ) గ్లింప్స్ లో .. కిచెన్‌లో ఏసీనా!.. నాన్న నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు అని చెప్పగా.. అవును నేను మ్యాన్ ఆఫ్ ది హౌస్ అంటూ వెంకటేష్ చెబుతారు. వాషింగ్ మెషిన్ కూడా ఉంది.. నీకు పని బాగా తగ్గిపోయినట్టేనని శ్రీనిధి శెట్టి చెప్పగా..చిట్టిగారు అని రఘుబాబు అంటుంటే అస్తమానం తలతిప్పకండి బుజ్జిగారు మెడ పట్టేస్తుంది.. నాకు ఎవరేం పని చేసినా నచ్చదు. అందుకే అన్నీ నేనే చూసుకుంటానంటున్నాడు వెంకీ.. ఆదర్శ కుటుంబం అంటూ నారా రోహిత్ డైలాగ్స్‌తో గ్లింప్స్ ఎండ్ అయింది. మొత్తానికి చిట్టిబాబుగా వెంకీ అండ్ ఫ్యామిలీ పక్కా వినోదాన్నిఅందించబోతుందని తాజా గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
ఎస్. రాధాకృష్ణ (చినబాబు), వంశీలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ (చిట్టిబాబు), కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ), యువినా పార్థవి (సంపూర్ణ), రాజా ప్రజ్వల్ (సర్వ), నారా రోహిత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కుటుంబ వినోదం, భావోద్వేగాలతో కూడిన ప్రధాన పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా క్రమంగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ మూవీ ప్రమోషన్ నిర్వహించనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘చిట్టిబాబు’ వచ్చేస్తున్నాడు.. వెంకటేష్ కొత్త పాత్రతో ‘AK47’ ప్రచారం ప్రారంభం
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ ప్రచారం మొదలైంది. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ను చిత్ర బృందం పరిచయం చేసింది. ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది
Read… pic.twitter.com/ksR8Gt3gU8
— TeluguBulletin.com (@TeluguBulletin) July 27, 2026
