Site icon vidhaatha

భార‌త కంపెనీ దగ్గు సిరప్ తాగి.. జాంబియాలో 66 మంది పిల్లలు మృతి

విధాత‌: జాంబియాలో 66 మంది చిన్నారుల మ‌ర‌ణానికి భార‌త కంపెనీ త‌యారు చేసిన ద‌గ్గు మందులు కార‌ణం అనే అంశంపై విచార‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. చిన్నారుల మ‌ర‌ణానికి ద‌గ్గు మందులే కార‌ణ‌మ‌నే క‌చ్చిత‌మైన నివేదిక‌ను డ‌బ్ల్యూహెచ్‌వో అందించ‌లేద‌ని విశ్వ‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

హ‌ర్యానాలోని సోనెప‌ట్‌లో మైడెన్ ఫార్మాస్యూటిక‌ల్ ఉత్ప‌త్తి చేసిన నాలుగు క‌లుషిత‌మైన నాణ్య‌త‌లేని ద‌గ్గు మందులే జాంబియాలో పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌ని WHO బుధ‌వారం హెచ్చ‌రించింది.

మ‌రోవైపు డ‌బ్ల్యూహెచ్‌వో సూచ‌న‌ల‌తో కేంద్ర బృందం మన దేశంలో విచార‌ణ ప్రారంభించింది. అయితే ఆ వివ‌రాల‌ను సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (CDSCO)కు డ‌బ్ల్యూహెచ్‌వో అంద‌జేయ‌లేదు. CDSCO కూడా ఇప్ప‌టికే హ‌ర్యానాలోని రెగ్యులేట‌రీ అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టింది.

ప్రాథ‌మిక విచార‌ణ‌లో మైడెన్ సంస్థ అన్ని అనుమ‌తులు క‌లిగి ఉన్న‌ద‌ని తేలింది. కానీ WHO ప‌రీక్షించిన మైడెన్ సంస్థ ద‌గ్గు మందుల్లో డైఇథిలియ‌న్ గ్రైకాల్, ఇథిలియ‌న్ గ్లైకాల్ ఉన్న‌ట్లు వెల్ల‌డైంది.

Exit mobile version