Green Tea : ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీని సహజ డిటాక్స్ పానీయంగా పేర్కొంటారు. రోజూ ఒక కప్పు గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. గ్రీన్ టీతో కలిగే ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే గ్రీన్ టీని అస్సలే వదలరు. మరె గ్రీన్ టీతో కలిగే ఆ ఐదు అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..?

గ్రీన్ టీలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల లాంటి ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండరాల నొప్పి, వాపును నియంత్రించడంలో తోడ్పడుతాయి.
గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది.
చాలామంది గ్రీన్ టీ తాగడానికి ముఖ్య కారణం బరువు తగ్గాలని. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్, కెఫిన్ జీవక్రియను పెంచుతాయి. కొవ్వును బర్న్ చేస్తాయి. ఆకలిని నియంత్రణలో ఉంచడానికి కూడా సాయపడతాయి. దాంతో గ్రీన్ టీ తక్కువ కేలరీలు తీసుకోవడంలో దోహదపడుతుంది.
గ్రీన్ టీ గొప్ప ఇమ్యునిటీ బూస్టర్. యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్పెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడంలో సాయపడతాయి.
గ్రీన్ టీలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంత క్షయం, దంతాల మీద ఫలకం పేరుకోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సాయపడుతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల వ్యాధిని తగ్గించడంలో కూడా తోడ్పడుతాయి. నోటి శుభ్రతను మెరుగుపరుస్తుంది.