జ‌ర జాగ్ర‌త్త‌.. మగ‌వారిలో త‌గ్గుతున్న వీర్య‌క‌ణాలు.. కార‌ణాలు ఇవే..?

పెళ్లైన జంట‌ల్లో చాలా మందికి త్వ‌ర‌గానే పిల్ల‌లు అవుతారు. కానీ కొన్ని జంట‌ల‌కు మాత్రం పిల్ల‌లు కారు. దీంతో మ‌హిళ‌లనే స‌మ‌స్య‌గా చూస్తుంటారు. ఆడ‌వారిలోనే లోపాలు ఉన్న‌ట్లు వేధిస్తుంటారు. కానీ మ‌గ‌వారిలో కూడా అదే స్థాయిలో లోపాలు ఉన్న‌ట్లు ప‌లు ప‌రిశోధ‌నల్లో తేలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌గ‌వారిలో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గుతున్న‌ట్లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

  • Publish Date - April 18, 2024 / 09:52 AM IST

పెళ్లైన జంట‌ల్లో చాలా మందికి త్వ‌ర‌గానే పిల్ల‌లు అవుతారు. కానీ కొన్ని జంట‌ల‌కు మాత్రం పిల్ల‌లు కారు. దీంతో మ‌హిళ‌లనే స‌మ‌స్య‌గా చూస్తుంటారు. ఆడ‌వారిలోనే లోపాలు ఉన్న‌ట్లు వేధిస్తుంటారు. కానీ మ‌గ‌వారిలో కూడా అదే స్థాయిలో లోపాలు ఉన్న‌ట్లు ప‌లు ప‌రిశోధ‌నల్లో తేలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌గ‌వారిలో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గుతున్న‌ట్లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. జీవ‌న‌శైలి, ప‌ర్యావ‌ర‌ణ అంశాలు అని తేలింది. అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే, వీర్య‌క‌ణాల‌ను పెంపొందించుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసుకుందాం..

బ‌రువును అదుపులో ఉంచుకోవాలి..

చాలా మంది మ‌గాళ్లు.. ఏది క‌నిపిస్తే అది తినేస్తుంటారు. దీంతో వారి శ‌రీరం భారీగా పెరిగిపోతుంది. ఊబ‌కాయం రావ‌డంతో హార్మోన్లు కూడా అస‌మ‌తుల్యంగా మారుతాయి. ఈ హార్మోన్ల ప్ర‌భావం.. వీర్యం మీద ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మొత్తానికి శుక్ర క‌ణాల సంఖ్య త‌గ్గ‌డం, చురుకుగా క‌ద‌ల్లేక‌పోవ‌డం, వీర్య క‌ణాల ఆకారం స‌జావుగా లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గితే సంతాన సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. బ‌రువు త‌గ్గేందుకు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూర‌గాయ‌లు, చిరు ధాన్యాలు, వెన్న తీసిన పాల ఉత్ప‌త్తులు తీసుకోవాలి. మాంసం, తీపి ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల వీర్యం నాణ్య‌త త‌గ్గిపోయిన‌ట్లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

మ‌త్తు మందుల‌కు, ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండాలి..

శ‌రీరాన్ని మ‌త్తులోకి తీసుకెల్లే మ‌త్తు మందుల‌కు, ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండాలి. కొకైన్, హెరాయిన్, గంజాయి, ఆక్సీకోడోన్, బెంజోడ‌యాజైపెన్స్, మెథాంఫెట‌మైన్ వంటి మ‌త్తు ప‌దార్థాలు పున‌రుత్ప‌త్తి అవ‌య‌వాల ప‌నితీరును దెబ్బ‌తీస్తాయి. ఆల్క‌హాల్ కూడా మంచిది కాదు. వీటిని సేవించ‌డం వ‌ల్ల శృంగార ఆస‌క్తి, టెస్టోస్టీరాన్ ఉత్ప‌త్తి, వీర్యం ఉత్ప‌త్తి, వీర్యం నాణ్య‌త మీద ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తాయి. కాబ‌ట్టి మ‌త్తు ప‌దార్థాల‌కు, ఆల్క‌హాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇక త‌ర‌చూ గంజాయిని తీసుకునే వారిలో వీర్యం నాణ్య‌త దెబ్బ‌తిన‌డ‌మే కాకుండా వృష‌ణాల క్యాన్స‌ర్ ముప్పు పెరుగుతున్న‌ట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

సిగ‌రెట్లు, బీడీల‌కు దూరంగా ఉండాలి..

సంతాన‌లేమితో బాధ‌ప‌డే పురుషులు సిగ‌రెట్లు, బీడీల‌కు దూరంగా ఉండాలి. ఇవి శ‌రీరం మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి. సంతాన సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తాయి. పొగ తాగ‌డం వ‌ల్ల శుక్ర క‌ణాల సంఖ్య పూర్తిగా ప‌డిపోతున్న‌ట్లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. దీంతో గ‌ర్భ‌ధార‌ణ అవ‌కాశాలు త‌క్కువైపోతున్నాయి. వీర్య క‌ణాల చురుకుద‌నం త‌గ్గుతుంది. ఎక్కువ‌గా సిగ‌రెట్లు తాగే వారిలో అంగ స్తంభ‌న స‌మ‌స్య కూడా త‌లెత్తుతుంది. వీర్యం డీఎన్ఏ కూడా దెబ్బ‌తింటుంది. ఒక వేళ సంతానం క‌లిగితే ఈ జ‌న్యు మార్పులు పుట్ట‌బోయే బిడ్డ‌కూ సంక్ర‌మిస్తాయి. కాబ‌ట్టి పొగ‌తాగే అల‌వాటు ఉంటే వెంట‌నే మానేయ‌డం మంచిది.

కాలుష్య కార‌కాల‌తో జాగ్ర‌త్త‌..

మ‌నం నిత్యం కాలుష్యానికి గుర‌వుతుంటాం. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లామంటే అనేక ర‌సాయ‌న కార‌కాలు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంటాయి. ఎలాగంటే.. తినే తిండి, తాగేనీరు, పీల్చే గాలి వంటి వాటితో ర‌సాయ‌న కార‌కాలు శ‌రీరంలోకి వెళ్తుంటాయి. దీంతో హార్మోన్లు అస్త‌వ్య‌స్త‌మై వీర్యం నాణ్య‌త‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి కాలుష్యం బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పండ్లు, కూర‌గాయ‌ల‌ను శుభ్రంగా క‌డ‌గాలి. ప్యాకెట్లు, డ‌బ్బాల్లో అమ్మే ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. త్వ‌ర‌గా కరిగిపోయే ప్లాస్టిక్ బాటిళ్ల‌తో నీరు తాగ‌క‌పోవ‌డం వంటివి మేలు చేస్తాయి. త‌ద్వారా సంతానం సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు.

Latest News