విధాత, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనార్ వినూత్నంగా విషెస్ తెలియచేశారు. పరీక్షల్లో 35మార్కులు వస్తే పాస్ అయిపోతామని..కాని డ్రంకన్ డ్రైవ్ లో 35(బీఏసీ) మార్కులు దాటితే మాత్రం చంచల్ గూడ జైలులో ఫ్రీ ఫుడ్, స్టే తప్పదని హెచ్చరించారు. పరీక్షల్లో ఫెయిలైతే ఏడాదే పోతది.. కానీ రోడ్డు మీద తేడా కొడితే లైఫే ఆగం అయితది’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ సజ్జనార్ ఈ పోస్టు చేశారు.
కొత్త ఏడాదిని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోండి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డ్రగ్స్ వాడి జీవితాన్ని విషాదం చేసుకోండని సజ్జనార్ యువతకు సూచించారు.
#DJLockUp by #Hyderabad City Police
Better to fail today—pass and you’ll end up in Chanchalguda with free food and stay.
పరీక్షల్ల 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్ల 35 (BAC) దాటితే మాత్రం ఔట్ అయినట్టే.
పరీక్షల్లో ఫెయిలైతే ఏడాదే పోతది.. కానీ రోడ్డు… https://t.co/ZpNHRzDA5G pic.twitter.com/UIT8VCUgLP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 31, 2025
ఇవి కూడా చదవండి :
New Year 2026 Celebrations : న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
Gorantla Butchaiah Chowdary : కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
