LB Nagar Metro Station | హైవేలు ఫుల్…ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో రద్దీ
దసరా సెలవులు ముగియడంతో పల్లెలనుంచి తిరిగి వస్తున్న ప్రజలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో రద్దీ పెరిగింది.
విధాత, హైదరాబాద్ : దసరా పండగ సెలవులు ముగిసిపోవడంతో పల్లెలకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ లో రెండు అంబులెన్స్ లో ఇరుక్కపోగా పోలీసులు..టోల్ గేట్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా పాట్లు పడ్డారు.
ఇక బస్సులు సైతం ప్రయాణికులతో కిక్కిరిసి నగరాలకు వస్తున్నాయి. బస్సుల్లో నగరానికి చేరిన ప్రజలు హైదరాబాద్ లోని తమ ప్రాంతాలకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైదరాబాద్-ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిటకిట లాడింది. మెట్రో స్టేషన్ వద్ధ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్రో టికెట్ కోసం ప్రయాణికులు బారులు తీరారు. రద్దీగా
దసరా పండుగ సెలవులు ముగించుకుని తిరిగి నగరానికి చేరుకుంటున్న ప్రజలతో ఇటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా కిక్కిరిసింది. రైల్వేస్టేషన్ ప్రాంగణాలు..ప్లాట్ ఫారమ్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram