తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తరుచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సమీక్ష నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను కలిసిన కవిత ప్రమాదం జరిగిన తీరు, జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలబడుతామని భరోసా ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని మెయిన్ సెంటర్ అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం జరిగితే.. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రావడానికి గంటకు పైగా సమయం పట్టిందని.ఇలాగైతే మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటాం అని ప్రశ్నించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తరువాత ఫైర్ డిపార్ట్‌మెంట్ వస్తే ఈ ప్రమాదాలను ఎలా ఆపగలుగుతాం? అని నిలదీశారు. ఫైర్ అక్సిడెంట్ లు జరిగినప్పుడు ఓ జోన్ పరిధి పైర్ సిబ్బంది రావాలనే దానిపై కూడా గందరగోళం నెలకొందని, దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్‌లో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. జీవనాధారమైన దుకాణాలు, అందులోని సామాగ్రీ, స్టాక్ అంతా దగ్ధమై నిర్వాహకులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. మరోసారి ఈ తరహా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
