అనారోగ్యంతో వచ్చే రోగులకు ఆరోగ్య చికిత్సలు చేసి పంపించాల్సిన పెద్దసుపత్రికే అడ్డోగోలు రోగాలు అంటుకున్నాయి. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి మొదటి అంతస్తులో మద్యం బాటిళ్లు కనిపించడం సంచలనం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయనే దానిపై రోగులు, సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటిగా కొనసాగుతున్న ఉస్మానియా ఆసుపత్రిలో బీరు బాటిళ్ల వ్యవహారం వెలుగుచూడటంతో ఆసుపత్రి ప్రతిష్ట, రోగుల భద్రతపై సందేహాలు రేగుతున్నాయి.
మద్యం బాటిళ్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. అసలు ఆసుపత్రిలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి..వాటిని ఎవరు తీసుకొచ్చారన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు.
🚨 ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు కలకలం
🔸 హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి మొదటి అంతస్తులో మద్యం బాటిళ్లు కనిపించడంతో కలకలం రేగింది.
🔸 ఆస్పత్రి ప్రాంగణంలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయనే దానిపై రోగులు, సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🔸 ఘటనపై పూర్తి స్థాయి విచారణ… pic.twitter.com/moduaQr1F1
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) July 30, 2026
