వివాదస్పద ఘటనలకు మొయినాబాద్ ఫామ్ హౌస్ లు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. డ్రగ్స్, రెయిన్ పార్టీల నిర్వహణ కేసులు అక్కడ పదుల సంఖ్యలో వెలుగుచూడగా..రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళల దారుణ హత్య ఘటన కలకలం రేపింది. తాజాగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ కి వెళ్లిన యువకుడు స్విమ్మింగ్ పూల్ అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించడం సంచలనం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు స్విమ్మింగ్ పూల్ నుంచి యువకుడి మృతదేహాన్నిబయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ యువకుడు స్విమ్మింగ్ పూల్ లో ఎలా పడిపోయాడు.. అసలేం జరిగింది? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు.. తాము రావడానికి ముందే యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
యాసంగి ధాన్యం కొనుగోలులో జాప్యం.. అన్నదాత అరిగోస
పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్
