Viral news | పెళ్లై 12 రోజులైనా భర్తను దగ్గరకు రానియ్యని భార్య.. గట్టిగా నిలదీయడంతో దిమ్మతిరిగే ట్విస్ట్..!

Viral news | ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. దాంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. దేశాంతరాలు దాటి పరిచయాలు పెరుగుతున్నాయి. స్నేహాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు చిగురిస్తున్నాయి. పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

  • Publish Date - May 29, 2024 / 06:13 PM IST

Viral news : ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. దాంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. దేశాంతరాలు దాటి పరిచయాలు పెరుగుతున్నాయి. స్నేహాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు చిగురిస్తున్నాయి. పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన తర్వాత 12 రోజులవరకు కూడా ఆమె తన భర్తను దగ్గరకు రానివ్వలేదు. 12 రోజుల తర్వాత గట్టిగా నిలదీయడంతో భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది.

ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి 2023లో అదే దేశానికి చెందిన అడిండా కంజా అనే మహిళ సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. నిత్యం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తర్వాత ఓ రోజు డైరెక్ట్‌గా కలిశారు. అయితే ఆ సమయంలో ఆమె ముసుగు ధరించి ఉంది. తమ సాంప్రదాయం ప్రకారం ముసుగు తీయవద్దని చెప్పింది. దాంతో అతడు కూడా ముసుగు తీయమని బలవంతం చేయలేదు.

అలా అతడితో ఆమె తరచూ ముసుగుతోనే కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఇద్దరూ స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వత కూడా ఆమె ముసుగు తేసేందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు శారీరకంగా కలిసేందుకూ అంగీకరించలేదు. అడిగినప్పుడల్లా ఆరోగ్యం బాగలేదంటూ సాకులు చెబుతూ వచ్చింది. ఇలా 12 రోజులు ఓపిక పట్టిన భర్త ఇక ఆగలేక గట్టిగా నిలదీశాడు. దాంతో అతనికి దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఎదురైంది.

అసలు అతను పెళ్లి చేసుకున్నది మహిళను కాదు పురుషుడిని అని అర్థమైంది. అతని గొంతు మహిళ గొంతులా మృదువుగా ఉండటం, శరీరం కూడా మహిళ శరీరంలా నాజూగ్గా ఉండటంతో మహిళల వస్త్రధారణలో తిరగుతూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఎదుటి వాళ్ల నుంచి నగదు లాగడం, ఆభరణాలతో ఉడాయించడం లాంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా భర్త నుంచి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తూ.. ఆ డబ్బు చేతికి అందకముందే దొరికిపోయాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Latest News