Werewolf | తోడేలులా మ‌గ‌పిల్లాడు.. ప్రెగ్నెన్సీలో త‌ల్లి పిల్లిని తిన్నందుకేనా..?

  • Publish Date - April 13, 2024 / 08:03 AM IST

Werewolf | ఈ ప్రపంచంలో వింత ఆకారంలో శిశువులు జ‌న్మించిన సంఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. జంతువుల మాదిరి ఎంద‌రో శిశువులు జ‌న్మించారు. కొంద‌రు పుట్టుక‌తోనే చ‌నిపోయారు. మ‌రికొంద‌రేమో ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఓ మ‌గ పిల్లాడికి తోడేలు మాదిరి శ‌రీర‌మంతా జ‌ట్టు వ‌చ్చింది. ఆ జుట్టును క‌త్తిరించిన కొద్ది మ‌రింత మందంగా జుట్టు వ‌చేస్తోంది. ఈ ఘ‌ట‌న ఫిలిఫిన్స్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఫిలిఫిన్స్‌కు చెందిన అల్మా గామంగాన్ రెండేండ్ల క్రితం ఓ మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఆ శిశువు మాన‌వ ఆకారాన్ని పోలిన‌ప్ప‌టికీ, అత‌ని త‌ల, ముఖం, మెడ‌, వీపు భాగం, మోచేతులు, కాళ్ల‌కు నిండుగా వెంట్రుక‌లు వ‌చ్చాయి. ఈ వెంట్రుక‌ల‌ను క‌త్తిరించిన కొద్ది మ‌రింత ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. మందంగా కూడా త‌యార‌వుతున్నాయి.

ప్రెగ్నెన్సీలో త‌ల్లి పిల్లిని తిన్నందుకేనా..?

అయితే అల్మా త‌న కుమారుడు క‌డుపులో ఉన్న‌ప్పుడు అడ‌వి పిల్లిని తినాల‌నే కోరిక క‌లిగింద‌ట‌. దీంతో త‌న స్నేహితులు న‌లుపు రంగులో ఉన్న అడ‌వి పిల్లిని తీసుకొచ్చి అల్మాకు ఇచ్చార‌ట‌. ఇక ఆమె ఆ పిల్లిని కూర‌గా చేసుకుని తిన్న‌ద‌ట‌. ఆ పిల్లిని తిన‌డం కార‌ణంగానే త‌న బిడ్డ జారెన్ ఇలా పుట్టి ఉండొచ్చ‌ని ఆమె భావిస్తోంది. పిల్లాడి శ‌రీర‌మంతా వెంట్రుక‌లు నిండిపోవ‌డంతో అవ‌మానాల‌కు గుర‌వుతున్న‌ట్లు త‌ల్లి వాపోయింది. స్కూల్లో జారెన్‌ను హేళన చేస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే జారెన్ భ‌య‌ప‌డిపోతున్నాడ‌ని అల్మా పేర్కొంది. ఫిలిఫిన్స్‌లో అడ‌వి పిల్లిని తిన‌డం వారి ఆచార‌మ‌ట‌.

అయితే వ‌ర్‌వూల్ఫ్ సిండ్రోమ్ లేదా హైప‌ర్‌ట్రికోసిస్ వంటి జ‌న్యు ప‌ర‌మైన మార్పులు సంభవించ‌డం కార‌ణంగానే జారెన్ శ‌రీర‌మంతా వెంట్రుక‌లు వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే పిల్లిని తిన‌డం వ‌ల్లే బాబు ఇలా జ‌న్మించాడు అనుకోవ‌డం పొర‌పాటు. దానికి, దీనికి ఎలాంటి సంబంధం లేద‌ని వైద్యులు తేల్చిన‌ట్లు అల్మా పేర్కొంది. ఇక ఎండ‌కు జారెన్ శ‌రీరం అంతా హిచ్చింగ్‌కు గుర‌వుతోంది. దీంతో త‌ల్లి అత‌నికి నిత్యం స్నానం చేయిస్తుంది. శ‌రీర‌మంతా వెంట్రుక‌ల‌తో పుట్టే శిశువులు చాలా అరుదు. వ‌న్ బిలియ‌న్ మందిలో ఒక‌రు ఇలా జ‌న్మిస్తార‌ని డాక్ట‌ర్లు పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా 50 దాకా ఉన్న‌ట్లు తెలిపారు.

Latest News