Air India | ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు.. టెల్‌ అవీవ్‌కు విమానాలు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

Air India | ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ - టెల్‌ అవీవ్‌ మధ్య విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

  • Publish Date - April 15, 2024 / 07:13 AM IST

Air India | ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ – టెల్‌ అవీవ్‌ మధ్య విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌ ఇండియా ఢిల్లీ – టెల్‌ అవీవ్‌ మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతూ వస్తున్నది. దాదాపు ఐదు నెలల సుదీర్ఘ విరామం అనంతరం మార్చి 3న ఈ సర్వీసులు మొదలయ్యాయి.

గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ టెల్‌ అవివ్‌లో దాడులకు తెగబడిన విషయం విధితమే. అనంతర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీనులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఇదిలా ఉండగా.. గత శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. రెండువందలకుపైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో దాడికి దిగింది. అయితే, ఇటీవల సిరియాలోని డమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరగ్గా.. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషరీ గార్డ్స్‌కు చెందిన కీలక అధికారితో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఇజ్రాయెలేనని.. ఆ దేశంపై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ హెచ్చరించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రకటించినట్లుగా దాడులకు పాల్పడింది.

Latest News