బ్యాంకాక్ లో రైలు ప్రమాదం..8 మంది దుర్మరణం

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో 8మంది దుర్మరణం చెందారు. రైల్వై క్రాసింగ్ సిగ్నల్ వద్ద పట్టాలపై ఆగిపోయిన ప్రయాణికుల బస్సును గూడ్స్ రైలు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

విధాత : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో 8మంది దుర్మరణం చెందారు.నగరంలోని మక్కసన్ ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో నిండిన ఓ బస్సు రైల్వే క్రాసింగ్ సిగ్నల్ వద్ద సరిగ్గా రైల్వే పట్టాల మీదే ఆగిపోయింది. అదే సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు బస్సుని ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. రైలు ఢీకొట్టగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.

మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ బస్సులో ప్రయాణిస్తున్నవారే. సమీపంలోని కొందరు బైక్ రైడర్లు గాయాలపాలయ్యారు. బస్సుకి అవతల వైపు ఆగి ఉన్న వాహనాలు కూడా ఈ ఘటనలో డ్యామేజ్ కావడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Latest News