Condom crisis | ఒలింపిక్స్ విలేజ్‌లో కండోమ్స్ కొరత.. 3 రోజుల్లో 10వేల కండోమ్స్ ఖతం
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 మిలన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్ (Milan-Cortina Winter Olympics)లో ఊహించని సంక్షోభం తలెత్తింది. గేమ్స్ జరిగే విలేజ్‌లో కండోమ్స్ కొరత ఏర్పడింది (Condom crisis).
Condom crisis | ఒలింపిక్స్ (Olympics) గేమ్స్ అంటే.. అథ్లెట్ల (athletes) ప్రదర్శన, పతకాల వేట, రికార్డులు, భావోద్వేగ క్షణాలు ఇవే కళ్లముందు కదలాడతాయి. అయితే, ప్రస్తుతం ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 మిలన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్ (Milan-Cortina Winter Olympics)లో ఓ వింత సమస్య తలెత్తింది. అక్కడ ఊహించని సంక్షోభం
(Condom crisis) ముంచుకొచ్చింది.
కండోమ్స్ సంక్షోభం..
ఒలింపిక్స్ విలేజ్‌లో (Olympic villages) కండోమ్స్ సంక్షోభం తలెత్తింది (Condom crisis). అక్కడ అథ్లెట్స్ కోసం నిర్వాహకులు అందించిన దాదాపు 10వేల కండోమ్ ప్యాకెట్లు కేవలం మూడు రోజుల్లో అయిపోవడం గమనార్హం. ఊహించని కొరత అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అథ్లెట్ల జోరుకు స్టాక్ నిండుకోవడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కొరతను తీర్చేందుకు తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన స్టాక్ ఆర్డర్ ఇచ్చారు.
మూడు రోజుల్లోనే స్టాక్ ఖాళీ..
కోర్టినా డి అంపెజోలోని విలేజ్‌లో సుమారు 2,900 మంది అథ్లెట్లు ఉంటున్నారు. వీరి కోసం నిర్వాహకులు ముందు జాగ్రత్తగా దాదాపు 9,700 ప్యాకెట్ల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచారు. అయితే, ఆటలు మొదలైన మూడు రోజుల్లోనే స్టాక్ మొత్తం అయిపోవడంతో అధికారులు షాక్ అవుతున్నారు. ఈ మేరకు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. విమర్శలు రాకముందే కొత్త స్టాక్‌ను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే స్టాక్ తెప్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవి ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి.
అందుకే కొరత..?
2024 పారిస్ ఒలింపిక్స్ సమయంలో వివిధ దేశాలకు చెందిన 14 వేల మంది క్రీడాకారుల కోసం ఏకంగా 3 లక్షల కండోమ్‌లు అందుబాటులో ఉంచారు. కానీ మిలాన్ ఒలింపిక్స్‌లో మాత్రం 2,900 మంది అథ్లెట్లకు గానూ కేవలం 9,700 ప్యాకెట్ల కండోమ్స్‌నే అందుబాటులో ఉంచారు. దీంతో డిమాండ్ పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
కండోమ్స్‌ను ఎందుకు పంపిణీ చేస్తారు..
ఒలింపిక్ క్రీడా గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది అథ్లెట్లు కొన్ని వారాల పాటు కలిసి ఉంటారు. ఆ సమయంలో వారికి హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంతోపాటూ వారి మధ్య సురక్షితమైన శృంగారాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వీటిని అందిస్తున్నారు. ఒలింపిక్ విలేజ్‌లో అథ్లెట్లకు ఉచిత గర్భనిరోధకాలు అందించే సంప్రదాయం 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి కొనసాగుతోంది. అయితే, గతంతోపోలిస్తే ఈసారి మాత్రం కండోమ్స్‌ను చాలా తక్కువగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, గతంలో కొవిడ్ సమయంలో సాన్నిహిత్యంపై నిషేధం విధించారు. ఇప్పుడు ఆ నిషేధం లేకపోవడంతో అథ్లెట్ల మధ్య కలయికలు పెరిగినట్లుగా కూడా ప్రచారం జరగుతోంది. పలితంగా ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Vaibhav Suryavanshi| వైభవ్ సూర్యవంశీ..పదో తరగతి పరీక్షలకు..!
Gold, Silver price today| పెరిగిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram