Olympics | పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. 40 మంది అథ్లెట్స్‌కు కొవిడ్ పాజిటివ్..!
Olympics | ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది అథ్లెట్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, ఎవరికి కరోనా సోకిందనే వివరాలు మాత్రం ప్రకటించలేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Olympics | ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది అథ్లెట్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, ఎవరికి కరోనా సోకిందనే వివరాలు మాత్రం ప్రకటించలేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోసారి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాస్తవానికి గతంలో కరోనా పాజిటివ్‌గా తేలిన సమయంలో ఆయా అథ్లెట్స్‌ని టోర్నీ నుంచి తొలగించేవారు. కానీ, ప్రస్తుతం అలాంటి నిబంధనలు ఏమీ లేవు.
ఈ క్రమంలో కొవిడ్ మహమ్మారి ఓ క్రీడాకారుడి నుంచి మరో క్రీడాకారుడికి సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. 40 మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల్లో తేలింది. ఒలింపిక్స్ ముగింపునకు మరికొన్ని రోజులు ఉండడంతో.. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 40 మందికి పైగా అథ్లెట్లకు కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వైరస్ ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ, ఆస్ట్రేలియా రన్నర్ లానీ పాలిస్టర్ సైతం కొవిడ్ బారినపడ్డుట్లు సమాచారం. ఆడమ్ పీటీ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. అలాగే, ఆస్ట్రేలియా అథ్లెట్ లైనీ పాలిస్టర్ అస్వస్థతకు గురవగా.. పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ నుంచి వైదొలిగింది. ఏఎఫ్‌టీ నివేదికల ప్రకారం.. 84 దేశాల నుంచి సేకరించిన డేటా గత కొన్ని వారాల్లో కోవిడ్ -19 పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉన్నది. టీమిండియా మూడు పతకాలతో 63వ ప్లేస్‌లో ఉన్నది.