Covid cases: ఢిల్లీలో భారీగా కరోనా కేసులు.. హై అలర్ట్
Covid cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒకే రోజు 23 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నారు. అయితే కేసుల్లో తీవ్రత తక్కువగానే ఉందని.. మరణాలు సంభవించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
ప్రస్తుతం ఒమెక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, ఏపీలో కేసులు నమోదు అవుతుండటంతో ఆయారాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.
ఆస్పత్రులకు కరోనా లక్షణాలతో వచ్చే బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే దేశరాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా 23 కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్నది.
జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, శ్వాస కోస ఇబ్బందులు వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రులు ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, పడకలు అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మాస్క్ ధరించాలని అప్రమత్తం చేయాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram