• Telugu News
  • /International

Sheikh Hasina | బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా.. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాన పదవికి రాజీనామా చేసి, భారత్‌ వచ్చిన షేక్‌ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని, సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్ కోసమే ఇలా చేసిందని ఆరోపించారు.

Reported by: Subbu | అంత‌ర్జాతీయం | Aug 11, 2024, 6:23 pm IST
Read Time: 4 mins
Sheikh Hasina | బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా.. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన ఆరోపణలు

సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్ కోసమే ఇదంతా చేసింది

విధాత: బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాన పదవికి రాజీనామా చేసి, భారత్‌ వచ్చిన షేక్‌ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని, సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్ కోసమే ఇలా చేసిందని ఆరోపించారు.బంగ్లాలో తాజా పరిస్థితులకు కారణం అమెరికానే కారణమని ఆరోపించారారు. ఈ మేరకు ఇటీవల ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు.తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్నారు. వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్నారని విమర్శించారు. దానికి తాను అంగీకరించలేదన్నారు. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు.

ఒకవేళ తాను సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టుకల్పిస్తే తన పదవి పోయేది కాదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ ప్రజలు దయచేసి అతివాదుల మాయలో పడవద్దని కోరుతున్నట్లు ఆ పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుడి దయవల్ల త్వరలోనే తిరిగి స్వదేశానికి వెళ్తానని చెప్పారు. అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని హసీనా పేర్కొన్నారు.
ఈ ఏడాది మేలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్‌ ఇచ్చారని ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. ఆమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేయడానికి అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదన్నారు. ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంత దూరం వెళ్తుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు.