Giorgia Meloni | గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడం అమానవీయం : ఇటలీ ప్రధాని మెలోనీ

Giorgia Meloni | గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరోగసీ పద్ధతిలో పిల్లలకు జన్మనివ్వడానికి వారేమీ సూపర్‌ మార్కెట్‌ ఉత్పత్తులు కాదని ఘాటుగా స్పందించారు.

  • Publish Date - April 14, 2024 / 10:16 AM IST

Giorgia Meloni : గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరోగసీ పద్ధతిలో పిల్లలకు జన్మనివ్వడానికి వారేమీ సూపర్‌ మార్కెట్‌ ఉత్పత్తులు కాదని ఘాటుగా స్పందించారు.

‘ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛా చర్యగా మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లలను సూపర్‌ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమలా మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తా’ అని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మెలోనీ వ్యాఖ్యానించారు. సరోగసీకి వ్యతిరేకంగా ఇటలీ సర్కారు తెస్తున్న బిల్లుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. సరోగసీ ద్వారా పిల్లలు కనే పద్ధతిని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పారు.

కాగా, సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హమైన నేరం. అతివాద భావజాలం కలిగిన అధికార పక్షం ఈ నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. సరోగసీ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లలను కనకుండా తాజా బిల్లు నిషేధించనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Latest News