26 ఏండ్ల యువ‌కుడిని పెళ్లాడిన 63 ఏండ్ల వృద్దురాలు.. ప్రెగ్నెన్సీ కన్‌ఫ‌ర్మ్‌..!

ఆమె వ‌య‌సు 63 ఏండ్లు.. అత‌ని వ‌య‌సు 26 ఏండ్లు.. అంటే ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ 37 ఏండ్లు. అయిన‌ప్ప‌టికీ వారిద్ద‌రి ప్రేమ చిగురించింది. ప్రేమ ద‌గ్గ‌రే ఆగిపోలేదు.. పెళ్లి కూడా చేసుకున్నారు. త‌మ ప్రేమ పెళ్లికి గుర్తుగా ఓ బిడ్డ‌ను క‌నాల‌నుకున్నారు ఆ దంప‌తులిద్ద‌రూ. ఇంకేముంది.. 63 ఏండ్ల వ‌య‌సులో ఆ వృద్ధురాలు త‌ల్లి కాబోతోంది.

  • Publish Date - May 14, 2024 / 11:19 PM IST

ఆమె వ‌య‌సు 63 ఏండ్లు.. అత‌ని వ‌య‌సు 26 ఏండ్లు.. అంటే ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ 37 ఏండ్లు. అయిన‌ప్ప‌టికీ వారిద్ద‌రి ప్రేమ చిగురించింది. ప్రేమ ద‌గ్గ‌రే ఆగిపోలేదు.. పెళ్లి కూడా చేసుకున్నారు. త‌మ ప్రేమ పెళ్లికి గుర్తుగా ఓ బిడ్డ‌ను క‌నాల‌నుకున్నారు ఆ దంప‌తులిద్ద‌రూ. ఇంకేముంది.. 63 ఏండ్ల వ‌య‌సులో ఆ వృద్ధురాలు త‌ల్లి కాబోతోంది. ప్రెగ్నెన్సీ క‌న్‌ఫ‌ర్మ్ కావ‌డంతో ఆ ప్రేమ ప‌క్షులు గాల్లో తేలిపోయాయి. టిక్ టాక్ వేదిక‌గా ఆ సంతోషాన్ని పంచుకున్నారు.

అమెరికాలోని జార్జియాకు చెందిన చెరియ‌ల్ మెక్‌గ్రేగ‌ర్(63), ఖురాన్ మెక్‌కెయిన్‌(26) మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ త‌ర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. త‌మ గాఢ‌మైన ప్రేమ‌కు గుర్తుగా పిల్ల‌ల‌ను క‌నాల‌కున్న ఆ దంప‌తులు స‌రోగ‌సీ ప్ర‌క్రియ‌ను ఎంచుకున్నారు. చెరియ‌ల్ త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతున్న‌ట్లు ఖురాన్ టిక్ టాక్ వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌కు తెలియ‌జేశారు. మొత్తానికి త‌మ ఫ్యామిలీని ప్రారంభించ‌బోతున్నామ‌ని, తాను తండ్రి కాబోతున్నాన‌ని ఖురాన్ రాసుకొచ్చారు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన పాజిటివ్ టెస్ట్ రిపోర్టును కూడా టిక్ టాక్ వీడియోలో చూపించారు. హాస్పిట‌ల్‌కు వెళ్ల‌గా బేబీ గుండె చ‌ప్పుడు వినిపించిన శ‌బ్దాల‌ను, స్కానింగ్ రిపోర్టుల‌ను కూడా వారు పంచుకున్నారు. స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌న‌బోతున్నామ‌ని వారు తెలిపారు.

ఖురాన్ – చెరియ‌ల్ ప్రేమ క‌థ ఇదే..

ఖురాన్, చెరియ‌ల్ మ‌ధ్య 2012లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్పుడు ఖురాన్ వ‌య‌సు 15 ఏండ్లు. చెరియ‌ల్ కుమారుడు క్రిస్ నిర్వ‌హిస్తున్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో ఖురాన్ ప‌ని చేసేవాడు. అప్పుడే చెరియ‌ల్‌కు ఖురాన్ ప‌రిచ‌యం అయ్యాడు. చాలా రోజుల త‌ర్వాత 2020 న‌వంబ‌ర్‌లో మ‌ళ్లీ క‌లుసుకున్నారు. ఆ స‌మ‌యంలో చెరియ‌ల్ – ఖురాన్ మ‌ధ్య ప్రేమ చిగురించింది. 2021, సెప్టెంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నారు.

చెరియ‌ల్‌కు ఏడుగురు పిల్ల‌లు

చెరియ‌ల్ త‌న మొద‌టి భ‌ర్త‌తో ఏడుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. 17 మంది గ్రాండ్ చిల్డ్ర‌న్స్ ఉన్నారు. అయితే ఖురాన్‌తో త‌న‌కున్న రిలేష‌న్‌షిప్‌కు చెరియ‌న్ ముగ్గురు పిల్ల‌లు అంగీకారం తెలిపారు. ఖురాన్ ఫ్యామిలీ కూడా అంగీకారం తెల‌ప‌డంతో వారిద్ద‌రూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ‌త కొన్నేండ్ల నుంచి పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు చెరియ‌ల్ – ఖురాన్ దంప‌తులు. చివ‌ర‌కు స‌రోగ‌సి విధానం ద్వారా పిల్ల‌ల‌ను క‌న‌బోతున్నారు.

Latest News