హిజాబ్ ధరించలేదని గాయని‌కి 74 కొరడా దెబ్బల శిక్ష..!

హిజాబ్ లేకుండా సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండేళ్లపాటు ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు.

ఇరాన్‌కు చెందిన ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు పరాస్తూ అహ్మదీ (29)కి ఇరాన్ పాలకులు షాక్ ఇచ్చారు. 2024 సంగీత కార్యక్రమంలో హిజాబ్ లేకుండా స్లీవ్‌లెస్ దుస్తుల్లో పాల్గొన్నారనే కారణంతో 74 కొరడా దెబ్బల శిక్ష విధించారు.

అంతేకాదు, రెండేళ్ల పాటు ప్రదర్శనలు ఇవ్వకూడదు, దేశం విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌లో అమల్లో ఉన్న కఠిన హిజాబ్ చట్టాల ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి. హిజాబ్ లేకుండా మహిలలను బయట కనిపిస్తే శిక్షలు కఠినంగా అమలు చేస్తుండటం ఆ దేశంలో కొనసాగుతుంది. అయితే హిజాబ్ చట్టాలు వ్యక్తి స్వేచ్చ, స్వాతంత్య్రాలపై దాడిగా, మహిళలపై అణిచివేతగా ఆ దేశంలో అడపదడపా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Latest News