Elon Musk| ఎలాన్ మస్క్ కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా లేఖ
ప్రపంచ కుబేరుడు, ఎక్క్ అధినేత ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ బహిరంగ లేఖ రాశారు. పాకిస్తాన్ రాజకీయాలు, మానవ హక్కులను వివరిస్తూ..జెైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గూర్చి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..ఇందుకు కారణమైన తన ఎక్స్(X) ఖాతాలో ఉన్న విజిబిటిటీ ఫిల్టరింగ్ ను సరిచేయాలని ఆమె మస్క్ ను లేఖలో వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, ఎక్క్ అధినేత ఎలాన్ మస్క్( Elon Musk) కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) భార్య జెమీమా గోల్డ్ స్మిత్(Jemima Goldsmith) బహిరంగ లేఖ(letter) రాశారు. పాకిస్తాన్ రాజకీయాలు, మానవ హక్కులను వివరిస్తూ..జెైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గూర్చి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..ఇందుకు కారణమైన తన ఎక్స్(X) ఖాతాలో ఉన్న విజిబిటిటీ ఫిల్టరింగ్ ను సరిచేయాలని ఆమె మస్క్ ను లేఖలో వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జెమీమా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి..దానిని మస్క్ కు ట్యాగ్ చేశారు.
చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్న నా భర్త ఇమ్రాన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు నా ఇద్దరు కుమారులకు అనుమతి ఇవ్వడంలేదు. కేవలం ‘ఎక్స్’ ద్వారా మాత్రమే ఇమ్రాన్‌ఖాన్ గురించి మా ఆవేదనను ప్రపంచానికి చెప్పగలుగుతున్నాం అని రాసుకొచ్చారు. పాక్ అధికారులు ఇమ్రాన్‌పై వ్యవహరిస్తున్న తీరు గురించి తాను పెడుతున్న పోస్టులు బయటకు రావడం లేదని, అవి ప్రజలకు చేరడం లేదని జెమీమా ఆవేదన వెలిబుచ్చారు. తన ఎక్స్ ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని ఆమె మస్క్‌కు విజ్ఞప్తి చేశారు.
పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను 2023నుంచి అడియాల జైలులో నిర్బంధించారు. ఇటీవల ఆయన మృతి చెందిన వార్తలు వెలువడటంతో పాక్ లో ఆయన మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఇమ్రాన్ జీవించి ఉన్నాడని ప్రకటించడంతో పాటు ఆయనను జైలులో కలిసేందుకు ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానుమ్ కు మాత్రమే అనుమతించారు. ఆమె ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన తర్వాత ఆయన సురక్షితంగానే ఉన్నారని ప్రకటించారు. అయితే ఇమ్రాన్ ను జైలులో వేధిస్తున్నారని, ఆయన ను విడుదల చేయాలంటూ తరచు ఆయన పార్టీ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram