Italy Parliament | ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీల డిష్యూం డిష్యూం.. జీ-7 సదస్సు ముందు ఘటన..!

Italy Parliament | ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు ముందు ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీలు కొట్టుకున్నారు. ఇటలీనే ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న వేళ, వివిధ దేశాల అధినేతలు ఇటలీకి చేరుకున్న సందర్భంలో పార్లమెంటులో ఎంపీలు కొట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జీ-7 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్రమోడీతోపాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

  • Publish Date - June 14, 2024 / 10:18 AM IST

Italy Parliament : ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు ముందు ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీలు కొట్టుకున్నారు. ఇటలీనే ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న వేళ, వివిధ దేశాల అధినేతలు ఇటలీకి చేరుకున్న సందర్భంలో పార్లమెంటులో ఎంపీలు కొట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జీ-7 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్రమోడీతోపాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఇలాంటి వేళ ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం గమనార్హం. పలు ప్రాంతాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలని రైటిస్ట్ గవర్నమెంట్ ప్లాన్ చేయడమే ఈ గొడవకు కారణమైంది. దీన్ని కొందరు ఫాసిజం రోజులతో పోల్చారు. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ (MS5) డిప్యూటీ లియోనార్డో డోన్నో, ప్రో-అటానమీ నార్తర్న్ లీగ్‌కు చెందిన ప్రాంతీయ వ్యవహారాల మంత్రి రాబర్టో కాల్డెరోలీ మెడలో ఇటాలియన్ జెండాను కట్టడానికి ప్రయత్నించడం కొట్లాటకు దారితీసింది.

ఇటలీలో మరిన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని కల్పించే ప్రణాళికను ఖండించే క్రమంలో డోన్నో ఈ చర్యకు పాల్పడ్డాడు. దాంతో ఒక్కసారిగా కాల్డెరోలీ అతని సహచరులు డోన్నోపై దాడి చేశారు. ఈ గొడవల్లో గాయపడిన డోన్నోని వీల్ చైర్‌లో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ కొట్లాట వార్త ఇటాలియన్ పత్రికల్లో హెడ్‌లైన్‌లలో నిలిచింది. ఇటలీ పార్లమెంట్ ”బాక్సింగ్ రింగ్”గా మారిందని మీడియా పేర్కొంది. ప్రధాని జార్జియా మెలోనికి చెందిన పార్టీ ‘లీగ్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ డోన్నోపై తీవ్ర విమర్శలు చేసింది. కావాలనే రెచ్చగొట్టాడని, అతని గాయాలు నకిలీవని ఆరోపించింది.

Latest News