Viral video | అయ్యబాబోయ్‌.. జో బైడెన్‌కు ఏదో అయ్యింది.. ఇటలీలో వింత ప్రవర్తన..!

Viral video | ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సు జరుగుతోంది. పలు దేశాల అధి నేతలు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లారు. అగ్ర రాజ్యం అమెరికా కూడా జీ-7లో సభ్య దేశం కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇటలీకి వెళ్లారు. అయితే ఇటలీలో బైడెన్‌ వింతగా ప్రవర్తించాడు. ఆయన వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైడెన్‌ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా అవుతున్నాయి.

  • Publish Date - June 14, 2024 / 10:51 AM IST

Viral video : ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సు జరుగుతోంది. పలు దేశాల అధి నేతలు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లారు. అగ్ర రాజ్యం అమెరికా కూడా జీ-7లో సభ్య దేశం కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇటలీకి వెళ్లారు. అయితే ఇటలీలో బైడెన్‌ వింతగా ప్రవర్తించాడు. ఆయన వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైడెన్‌ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా అవుతున్నాయి.

ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల అధినేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్‌ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్‌లు వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ కనిపించారు.

అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకెత్తి ఎవరినో పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన ఇటలీ ప్రధాని మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

అయితే బైడెన్‌ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో చక్‌ షూమర్‌ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. పోడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్‌ మీద ఉన్న మిగతావాళ్లకు చేయి కలిపాడు. ఆ కొద్ది క్షణాల్లో తనకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ఇవ్వబోతూ కనిపించాడు. ఆ తర్వాత షూమర్‌ తన ప్రసంగం మొదలుపెట్టడంతో బైడెన్‌ షేక్‌ హ్యాండ్‌ కోసం చాచిన చేతిని పెదాలపైకి తీసుకుని ఆలోచనలో పడ్డట్టుగా కనిపించింది. ఆ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్‌. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం పేరును, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరును సైతం మర్చిపోయాడు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు.

Latest News