గ్రేట్ జంప్.. 31మీటర్ల ఎత్తైన వంతెన మీదుగా లోయలోకి జంపింగ్!

ఫ్రాన్స్‌కు చెందిన జెరెమీ నికోలిన్ 31మీటర్ల వంతెనపై నుంచి లోయలోకి జంప్ చేస్తూ ఊపిరి ఆరిపించే రికార్డు ఫీట్ సాధించాడు!

గ్రేట్ జంప్.. 31మీటర్ల ఎత్తైన వంతెన మీదుగా లోయలోకి జంపింగ్!

విధాత : ఫ్రాన్స్ కు చెందిన ప్రొఫెషనల్ క్లిఫ్ జంపర్ జెరెమీ నికోలిన్ తన జంపింగ్ సాహసాల్లో మరో సరికొత్త రికార్డు అందుకున్నాడు. 34 ఏళ్ల జెరెమీ నికోలిన్ ఈ దఫా ఏకంగా 31 మీటర్ల ఎత్తైన వంతెనపై నుండి ఒక లోయలోని నీళ్లలోకి విజయవంతంగా దూకగలిగాడు. ఇది అత్యంత సాహసోపేతమైన..ప్రమాదకరమైన స్టంట్ గా మారింది. ఏ మాత్రం తేడా వచ్చిన కొండలపై పడి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదమున్నప్పటికి జెరెమీ నికోలిన్ మాత్రం భయపడకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అతను జంపింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులంతా ఊపిరి బిగపట్టి చూశారు.

గత నవంబర్ లో 27మీటర్ల ఎత్తు పై నుంచి జలపాతంలోకి దూకాడు. ఈ మాజీ అథ్లెట్ 60మీటర్ల మీటర్ల ఎత్తు నుండి దూకి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 31మీటర్ల ఫీట్ ను తాజాగా పూర్తి చేశాడు. ప్రస్తుతం 58.8మీటర్ల ఎత్తు నుంచి దూకడం ప్రపంచ రికార్డుగా కొనసాగుతుంది. ఈ రికార్డు బ్రెజిల్ కు చెందిన స్విస్ లాసో చాలర్ పేరిట కొనసాగుతుంది.