విధాత, హైదరాబాద్: వెండి, బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేశాయి. బుధవారం కిలో వెండి ధర ఒకేసారి రూ.13,000పెరిగి రూ.4,0000 లక్షల మార్కు చేరుకుంది. ఒక్క జనవరి నెలలో కిలో వెండి ధర రూ.1,50,000పెరుగడం వెండి ధరల దూకుడుకు నిదర్శనం.
2025జనవరి నుంచి 2026జనవరి మాసాంతానికి కిలో వెండి ధర ఏకంగా రూ. 3లక్షలు పెరిగి రూ.4లక్షల మార్కు చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది కాలంలో 6లక్షల మార్కు కూడా చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగార ధర సరికొత్త రికార్డు నమోదు
వెండితో పోటాపోటీగా బంగారం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,220పెరిగి… రూ. 1,65,170కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,950పెరిగి రూ.1,51,400కు చేరింది. సరిగ్గా ఏడాది వ్యవధిలో 2025జనవరి నుంచి 2026జనవరి మాసాంతానికి తులం బంగారం ధర 85పెరిగి రెండింతలు పెరిగిపోవడం గమనార్హం. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, పారిశ్రామిక, పెట్టుబడి అవసరాలు, ద్రవ్యోల్భణం, డాలర్ బలహీనతల నేపథ్యంలో భవిష్యత్తులోనూ బంగారం, వెండి ధరలు ఇదే రీతిలో పెరిగిపోనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్ మార్కెట్ లో ఫిబ్రవరి 18నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోలుదారులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది.
