ఎవరు చేసే పని వారు చేస్తే బెటర్ అంటారు. కాదు కూడదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఫలితం ప్రతికూలంగా ఉండవచ్చనడానికి అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ వ్యవహారమే నిదర్శనంగా కనిపిస్తుంది. అమెరికాలో ప్రముఖ డాక్టర్ ఓజ్ ఇంటిపై రెండు బ్లాక్ రేసర్ జాతి సర్పాలను కెన్నడీ పట్టుకున్నారు. అయితే పాములను పట్టుకునే క్రమంలో కెన్నడీ ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించకుండా ఒట్టి చేతులతో పాములను పట్టుకున్నాడు.
ఈ ప్రయత్నంలో ఆ పాములు అతడిని పలుమార్లు కాటేశాయి. అయితే అవేవీ విషపూరితమైన పాములు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదాలపై అప్రమత్తత పాటించడంలో ఆదర్శంగా ఉండాల్సిన ఆరోగ్య మంత్రినే ఇలా దుస్సాహసంతో ముందు జాగ్రత్తలు లేకుండా పాములు పట్టడం ఏమిటన్న విమర్శలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అమెరికా మంత్రి అత్యుత్సాహం.. కాటేసిన పాములు!
అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీని పాములు కాటేశాయి. అయితే, అవేవీ విషపూరితం కావు. అమెరికాలో ప్రముఖ డాక్టర్ ఓజ్ ఇంటిపై రెండు బ్లాక్ రేసర్ జాతి సర్పాలను కెన్నడీ పట్టుకున్నారు. అయితే, ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు లేకుండా… pic.twitter.com/FDDYrSV338
— Telugu Stride (@TeluguStride) May 27, 2026