US operation Hormuz Strait | హర్మూజ్ లక్ష్యంగా అమెరికా ఆపరేషన్..గల్ఫ్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు

ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ గుప్పిట నుంచి తెరిపించే లక్ష్యంతో అమెరాకా ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇంకోవైపు హర్మూజ్ జలసంధిపై ప్రయాణంచే నౌకలపై ఇరాన్ పార్లమెంటులో టోల్ టాక్స్ బిల్లును ప్రవేశపెట్టడటం సంచలనంగా మారింది. శతృదేశాల చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుంది.

Hormuz strait

విధాత : ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ గుప్పిట నుంచి తెరిపించే లక్ష్యంతో అమెరాకా ఆపరేషన్ మొదలు పెట్టింది. 20వ రోజు కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ మిసైల్ లాంఛర్లు, డ్రోన్లపై దాడులకు రంగంలోకి అమెరికా అపాచీ హెలికాప్టర్లు, ఏ- 10, ఎఫ్ -35 యుద్ధ విమానాలతో దాడులు కొనసాగిస్తుంది. ఎ-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్‌ ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి.ఇప్పటి వరకు అమెరికా 120 ఇరాన్ నౌకలపై దాడి చేసింది.

హర్మూజ్ జలసంధి మార్గంలో సముద్రంలో అమర్చిన ఇరాన్ సీమైన్స్, మిసైల్స్ క్లియర్ చేసేందుకు 2200 మంది అమెరికా మెరైనర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరు ఇరాన్‌ దక్షిణతీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకొని హర్మూజ్‌ జలసంధిపై పట్టు సాధించాలన్న వ్యూహాన్ని అమలు చేసేందుకు పోరాడనున్నారు. ఇరాన్ దాడులను తిప్పికొడుతూ.. సీమైన్స్ తొలగించేందుకు వారానికిపైగా సమయం పట్టవచ్చని ఆ దేశ మిలటరీ అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు సాయంగా మిత్రదేశాల హెలికాప్టర్లు, నౌకలు రంగంలోకి దిగాయి. మరోవైపు ప్రపంచ దేశాల అసంతృప్తి నేపథ్యంలో ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌లపై తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు.

హర్మూజ్ జలసంధి నౌకలపై ఇరాన్ టోల్ టాక్స్ ప్రతిపాదన

హర్మూజ్ జలసంధిపై ప్రయాణంచే నౌకలపై ఇరాన్ పార్లమెంటులో టోల్ టాక్స్ బిల్లును ప్రవేశపెట్టడం సంచలనంగా మారింది. యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేసింది. హర్మూజ్ నుంచి ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ జల మార్గంలో టోల్ అమలులోకి వస్తే క్రూడాయిల్ ధరలు మరింత పెరగనున్నయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ టోల్ టాక్స్ ప్రతిపాదనను అమెరికా, యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ టోల్ ట్యాక్స్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం పడటం తప్పదని నిపుణులు తేల్చి చెబుతున్నానరు.

చమురు కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు

మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ప్రతిఘటిస్తున్న ఇరాన్..ఇంకోవైపు గల్ఫ్ లోని వాటి మిత్రదేశాల వైమానిక స్థావరాలు, చమురు, గ్యాస్ కేంద్రాలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుంది. టెల్ అవీవ్, ఖతార్, కువైట్‌, బహ్రెయిన్ లను, ఆ దేశాల చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక, డ్రోన్ దాడులు కొనసాగిస్తుంది.

Latest News