Betting Apps Promoters: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై యాడ్స్ ప్రోహిబిషన్ ?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన యూ ట్యూబర్లు, సినీ, స్పోర్ట్స్ సెలబ్రెటీలపై మూడేళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించాలన్న ఫిర్యాదు సంచలనం రేపుతోంది.

Betting Apps Promoters: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన యూ ట్యూబర్లు, సినీ, స్పోర్ట్స్ సెలబ్రెటీలపై మూడేళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించాలన్న ఫిర్యాదు సంచలనం రేపుతోంది. అడ్వొకేట్ కృష్ణకాంత్ బెట్టింగ్ యాప్స్ కేసులపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కు ఫిర్యాదు చేశారు. యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై మూడేళ్లు యాడ్స్ చేయకుండా నిషేధం విధించడంతో పాటు రూ.10 నుంచి 50 లక్షల వరకు జరిమానా విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దూకుడు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీస్ శాఖ దూకుడు పెంచింది. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్, సెలబ్రెటీలు 25మందిపైన కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు పలు యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించారు. జంగిల్ రమ్మి యాప్ కోసం రానా, ప్రకాష్‌రాజ్, ఏ23 యాప్ కోసం విజయ్‌దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ కోసం హీరోయిన్ ప్రణీత, జీట్‌విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం శ్యామల.. హర్షసాయి, విష్ణుప్రియ, రీతుచౌదరి, టేస్టీ తేజ, బయ్య సన్నీలు పలు యాప్స్‌కు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఆయా కంపనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు మంగళవారం మరోసారి విష్ణుప్రియ, రీతు చౌదరిలను విచారించారు. వారు ఎన్ని యాప్స్ ప్రమోట్ చేశారన్న వివరాలను రాబట్టారు. మరోవైపు విష్ణుప్రియ కూడా తనపైన నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.